Homeఎంటర్టైన్మెంట్Iraivan Trailer: "రాక్షసుడు' కు మించిన క్రైం థ్రిల్లర్‌ ఇది.. ప్రతీక్షణమూ భయమే!

Iraivan Trailer: “రాక్షసుడు’ కు మించిన క్రైం థ్రిల్లర్‌ ఇది.. ప్రతీక్షణమూ భయమే!

Iraivan Trailer: రాక్షసన్‌.. నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన సినిమా ఇది. అప్పటిదాకా క్రైం థ్రిల్లర్‌ జోన్‌ ను పూర్తి గా మార్చిన సినిమా ఇది. తమిళంలో విడదలయి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. రామ్‌ కుమార్‌ స్టోరీ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వం ఈ సినిమాను శిఖరస్థాయిలో నిలబెట్టాయి. విష్ణు విశాల్‌ యాక్టింగ్‌, జిబ్రాన్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా తమిళంలో ఎన్నో పోలీస్‌, క్రైం సినిమాలు వచ్చినప్పటికీ రాక్షసన్‌ సినిమాను బీట్‌ చేయలేపోయాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా మించేలా ఓ సినిమా తమిళంలో సందడి చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటో, దాని కథ ఏమిటో తెలుసుకుందామా?

తనీ ఒరువన్‌ తెలుసు కదా! జయం రవి సినీ కెరియర్‌లో తోపు లాంటి సినిమా. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్‌ సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. నయనతార జయంరవికి జోడిగా నటించింది. అరవింద్‌ స్వామి విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తనీఒరువన్‌ జంట జయం రవి, నయనతార కాంబినేషన్‌లో ఇరైవన్‌ అనే ఓ సినిమా రూపొందుతోంది. సుధన్‌ సుందరం, జి. జయరాం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఎండ్రెండ్రుమ్‌ పున్నగై, మనిదన్‌ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన అహ్మద్‌.. కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఈ సినిమాకు యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కే. వేదాంత్‌ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈనెలలో విడుదల కాబోతోంది. ఈసినిమాకు సంబంధించిన ట్రెయిలర్‌ విడుదల చేశారు. దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రెయిలర్‌ హీరో వర్సెస్‌ విలన్‌ మధ్య పోరాటంలాగా ఉంది. ట్రెయిలర్‌ ప్రకారం ఇందులో జయం రవి పోలీస్‌ గా కన్పించాడు. అమ్మాయిలను చంపే నరరూప హంతకుడిగా రాహుల్‌ బోస్‌ నటించాడు. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌స్టోరీతో తీసిన ఈ సినిమాలో హీరో విలన్‌ మఽధ్య రసవత్తర సన్నివేశాలు చూపించారు. ఇదో మరో రాక్షసన్‌ సినిమాకు మించి క్రేజీ హర్రర్‌ థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇరైవన్‌ అంటే తమిళంలో అంటే భగవంతుడు అని అర్థం. అయితే ఈచిత్రంలో మనుషులను కిరాతంగా చంపే విలన్‌ తనను దేవుడిగా భావించుకుంటాడా? లేక ఆ నరహంతకుడిని అంతం చేసే కథానాయకుడు దేవుడా? అనేది చిత్రంలో చూడాల్సిందే. అయితే హీరోయిన్‌ నయనతార కూడా ఇందులో మంచి పాత్ర చేసిందని దర్శకుడు చెబుతున్నాడు. తన పెళ్లి కాకముందే ఈ సినిమాను ఒప్పుకోవడంతో.. కొంచెం గ్లామరస్‌గా కన్పించినట్టు తెలుస్తోంది. మధ్యలో కోవిడ్‌ వల్ల షూటింగ్‌కు బ్రేక్‌ ఏర్పడింది. తర్వాత సినిమాను తీశారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రెయిలర్‌ మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular