
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. అయితే ఏ యాక్షన్ కథతోనే లేక కామెడీ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ లాంచ్ అవొచ్చు. కానీ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్రలో వైష్ణవ్ కనిపించబోతున్నాడు. ఉప్పెన ఓ విషాద వంతమైన ప్రేమ కథ అని, అయితే ప్రేమలో విఫలమైన జంటగా మిగిలినప్పటికీ, హీరోహీరోయిన్లు జీవితంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారని.. సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా సినిమా పాయింట్ మరీ కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని ఏకంగా ఆ హీరో మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారు.
విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు
దాంతో ఆ హీరో ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్)కి కనబడకుండా తిరుగుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ యువకుడి(హీరో) కోసమే పరితపిస్తూ ఉంటుంది. చివరికి ప్రేమకు కావాల్సింది మగతనం కాదు, మనసు అని ఆమె ఆతన్ని ఒప్పించి ఫైనల్ గా వారు ఒక్కటవుతారు. ఇదే ఈ సినిమా పాయింట్. కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఇప్పటికైతే రిలీజ్ డేట్ కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు గాని, కరోనా తగ్గాకే రిలీజ్ ఉంటుంది.
ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు
అన్నట్టు ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా నిర్మించారు. పైగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి.