Khiladi Movie: మాస్ మహారాజ్ రవి తేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నదని చెప్పాలి. ఆయన తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడి” అనే సినిమాలో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు… వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్… ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది.
ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీపావళి కానుకగా ఈ రెండో గీతాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. ఇందులో రవితేజ… ఓ ఎడారిలో బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ స్టైలిష్‌గా కనిపించారు. దీంతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, తొలి పాట అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ అప్డేట్ తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి.
Here’s the Announcement y’ll been waiting for!! #Khiladi Second Single will be out on November 4th. @RaviTeja_offl @ThisIsDSP @DimpleHayathi @Meenakshiioffl @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @sagar_singer pic.twitter.com/i7Fog9nxVR
— Ramesh Varma (@DirRameshVarma) October 29, 2021
ఈ మూవీలో ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రాక్షసుడు మూవీతో ఘన విజయాన్ని అందుకున్నారు రమేశ్ వర్మ. మరోవైపు రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో… యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.