https://oktelugu.com/

ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత.. శుభవార్తలు వస్తాయంటూ?

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో తన ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చైతన్యతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో షాకింగ్ ప్రకటన చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమంత తన మనస్సులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు. సమంత సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి పోస్ట్ గురించి అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. సమంత తన పోస్టుల ద్వారా తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2021 / 10:19 AM IST
    Follow us on

    స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో తన ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చైతన్యతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో షాకింగ్ ప్రకటన చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమంత తన మనస్సులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు. సమంత సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి పోస్ట్ గురించి అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. సమంత తన పోస్టుల ద్వారా తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

    తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కోట్ ను పోస్ట్ చేశారు. “గుర్తుపెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైనా శుభవార్త వస్తూనే ఉంటుంది” అని సమంత కామెంట్ చేయడం గమనార్హం. సమంత త్వరలో ఏదో శుభవార్తను అభిమానులతో పంచుకోబోతున్నారని ఆమె పోస్ట్ ద్వారా తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత బాధ నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేస్తున్నారని సమాచారం అందుతోంది.

    సమంత నటించిన శాకుంతలం షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తి కాగా ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గుణశేఖర్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా అర్హ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

    సమంత నుంచి కొంతకాలం గ్యాప్ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుణశేఖర్ ఈ సినిమా కోసం సమంత మార్కెట్ ను మించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.