https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ కానున్న కంటస్టెంట్ ఎవరంటే…

Bigg Boss 5:  తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఫైవ్ మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయంలో విభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటు వంటి ‘బిగ్ బాస్’ తెలుగు ఐదవ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా ఈ సీజన్ లో కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 12:41 PM IST
    Follow us on

    Bigg Boss 5:  తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఫైవ్ మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయంలో విభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటు వంటి ‘బిగ్ బాస్’ తెలుగు ఐదవ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా ఈ సీజన్ లో కూడా నాగ్ తనదైన శైలిలో అదరగొట్టారు. ప్రతి సీజన్ లానే ఈసారి సీజన్ కూడా మంచి రసవత్తర ఎలిమెంట్స్ తో కొనసాగుతూ ఎట్టకేలకు చివరి దశకి చేరుకుంటుంది. ఇక ఈ వారం కూడా అయ్యిపోతే షో ఇంకో వారం లో ముగిసిపోనుంది. దీనితో టాప్ -5లో ఎవరు ఉంటారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

    మరి ఈ చిట్ట చివరి వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలుగుతారు అనే ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ నుంచి మొదటి నుంచే టార్గెటెడ్ గానే ఉన్న నోటెడ్ కంటెస్టెంట్ కాజల్ ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో కాజల్ కి తక్కువ ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక బిగ్‌‌బాస్ హౌజ్‌‌లోకి 17 వ కంటెస్టెంట్‌‌గా అడుగుపెట్టిన కాజల్.. మొదటి రెండుమూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారంతా కానీ.. తన ఆటతో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది..అయితే ఇప్పుడు ఆమె ఎలిమినేషన్ కి రంగం సిద్దమైనట్టుగా సమాచారం. కాగా ఇప్పటికే సింగర్ శ్రీరామ్ ఫినాలేకి చేరుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ వారాంతం ఎలిమినేట్ అయ్యేది తనేనా కాదా అనేది వేచి చూడాలి.