Homeఎంటర్టైన్మెంట్Tina Ambani: ఈ నటి 10,000 కోట్లకు మహారాణి.. ఇప్పుడు దివాళా తీసింది

Tina Ambani: ఈ నటి 10,000 కోట్లకు మహారాణి.. ఇప్పుడు దివాళా తీసింది

Tina Ambani: ఓడలు బండ్లవుతుంటాయి. బండ్లు ఓడలవుతుంటాయి. ఈ సామెతకు ఎవరూ అతీతం కాదు. కాకపోతే ఈ నటి జీవితంలో అది అత్యంత నాటకీయంగా జరిగింది. దీనిని కనుక ఒక కథగా మలిచి సినిమాగా రూపొందిస్తే సూపర్ హిట్ అవడం ఖాయం. ఇంతకు ఎవరు ఆ నటి? ఏమిటి ఆమె దివాళా కథ. ఏంటో మీరూ చదివేయండి..

అది 90 ల కాలం. ఆ బాలీవుడ్ నటి కోసం రిషికపూర్ నుంచి మొదలు పెడితే సంజయ్ దత్ వరకు కొట్టుకుంటున్నారు. ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు సూపర్ హిట్ అవుతుందనే భావనే ఇందుకు కారణం. పైగా మంచి వయసులో ఉండటంతో ఆమె నటనకు, డ్యాన్సులకు ప్రేక్షక లోకం ఊగిపోయేది.. దేశ్ పరదేశ్ అనే సినిమా ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆమె బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ లాగా మారింది. రిషి కపూర్,రాజేష్ ఖన్నా,అమల్ పారేఖ్ దిగ్గజ నటులతో ఆడి పాడింది. వరుస విజయాలతో తిరుగులేని స్టార్ డం అనుభవించింది. తర్వాత వరుస పరజయాలతో ఇబ్బంది పడింది.

హీరోలు కొట్టుకున్నారు

వరుసగా ప్లాపులు ఉన్నప్పటికీ 1987లో ఆమె రెండు సినిమాలు చేసింది. 1991లో జిగర్వాలా చిత్రంలో చివరిసారిగా కనిపించింది. అయితే సదరు నటి చాలామందితో ప్రేమాయణం నడిపిందని పుకార్లు వినిపించేవి. చివరికి రిషి కపూర్ తో కూడా ఎఫైర్ ఉందని అప్పట్లో గుసగుసలు వినిపించేవి. అయితే అదంతా అబద్ధమని రిషి కపూర్ తన ఆత్మ కథలో వెల్లడించారు. అయితే ఇది నిజం అనుకోని సంజయ్ దత్ గొడవపడేందుకు తన ఇంటికి వచ్చాడని ఆయన అందులో రాసుకొచ్చారు. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఎంత క్రేజ్ ఉందో.

1991 ఫిబ్రవరి 2న ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు విరామం ప్రకటించింది. ఒకానొక దశలో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ పదివేల కోట్లకు చేరింది. తర్వాత తరచూ వివాదాలలో తల దూర్చడం వల్ల ఆమె సంపద, ఆమె భర్త సంపద కరిగిపోవడం ప్రారంభమైంది. ఇలా ఆమె ఆస్తులు ప్రస్తుతం 2000 కోట్లకు పడిపోయాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ. అంబానీ పెళ్లి చేసుకోక ముందు ఆమె బాలీవుడ్లో నటిగా ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో చాలామందికి పోటీ ఇచ్చింది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో పెద్దపెద్ద హీరోలకు మంచి ఆప్షన్ గా ఉండేది. తర్వాత వరుసగా పరాజయాలు ఎదురు కావడంతో సినిమాలకు క్రమంగా దూరమైంది. అనిల్ అంబానేని పెళ్లి చేసుకున్న తర్వాత బిలియనీర్ గా ఎదిగింది. తర్వాత క్రమంగా పడిపోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version