Chatrapathi: ఒక సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారమైతే కాదు. దాని కోసం దర్శకులు తలలు పగిలేలా ఆలోచిస్తూ రాత్రింబవళ్లు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు…ఇక ఈ కష్టంలో నుంచే వాళ్ళకి ఒక స్టార్ డమ్ అయితే వస్తోంది. ఒక సినిమాతో సక్సెస్ వచ్చిందంటే చాలు టాప్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోతారు. కానీ ఆ సక్సెస్ ని అందుకోవడం అంత ఆశామాషీ వ్యవహారమైతే కాదు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు లో ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆయన చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఆయన అందుకుంటున్న ప్రతి విజయం వెనక ఆయన పడిన కష్టమైతే ఉంటుంది. ఇక దానికి తోడుగా టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నిజానికి మొత్తం ఫ్యామిలీని తన టీమ్ గా మార్చుకొని వాళ్ళచేత సినిమా వర్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాడు. ఆయన ఇంట్లోనే ఒక రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులతో సహా అందరు ఉన్నారు. వాళ్ళంతా రాజమౌళికి బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి రాజమౌళి అంత గొప్ప అద్భుతాలను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతున్నాడు అంటూ చాలా మంది కామెట్లయితే చేస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లందరి ఇన్పుట్స్ తీసుకొని రాజమౌళి ఒక గొప్ప సినిమా తీయడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాలో ఒక సీన్ రాసింది రాజమౌళి కాదట…కీరవాణి తమ్ముడు అయిన కాంచి గారు ఈ సినిమాలో ఒక సీన్ అయితే రాశారట. నిజానికి ఆయన స్వతహాగా రైటర్ కావడం తో ఈ సినిమాలో ఆ సీన్ రాశాడట…ఆ సీన్ ఏంటి అంటే ప్రభాస్ చిన్నతనంలోనే చనిపోయాడని వాళ్ళ అమ్మ అనుకుంటుంది.
ఇక ప్రతి సంవత్సరం ప్రభాస్ తమ్ముడు అయిన షఫీ తో పిండ ప్రధానం చేయిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సంవత్సరం పిండ ప్రధానం చేసి తన అన్నకు మొక్కమని తమ్ముడు అయిన షఫీ కి చెబుతోంది. ఇక ఈ క్రమంలో అన్నయ్య మీద ఉన్న కోపంతో తమ్ముడు ఆ గంగాజలం ఉన్న చెంబు ని సముద్రంలోకి విసిరేస్తాడు. ఇంటర్వెల్ కి ముందు కాట్రాజ్ తో ప్రభాస్ ఫైట్ చేస్తున్న క్రమంలో అతను చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ గంగాజలం ఉన్న చెంబు ప్రభాస్ కి దొరుకుతుంది. దాంతో రౌడీని కొట్టి ఆ గంగాజలాన్ని తనమీద పోసుకుంటాడు.
ఇలా ఒక సీను ఉంటే బావుంటుందని దాన్ని ఇంటర్ లింక్ చేసి రాస్తే ఎమోషనల్ గా హీరోయిజం కూడా వర్కౌట్ అవుతుందని కాంచీ గారు చెప్పి ఆ సీన్ రాశారట… ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొత్తానికైతే ఆ సీన్ థియేటర్లో చాలా బాగా పేలింది. తద్వారా కాంచి గారు ఇచ్చిన ఇన్పుట్ తనకు చాలావరకు ఉపయోగపడిందని రాజమౌళి ఓపెన్ గా చెప్పడం విశేషం… మొత్తానికైతే కాంచి ఇచ్చిన ఇన్పుట్ ను రాజమౌళి తీసుకొని దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…