Heroine Ayesha Takia: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. కమర్షియల్ గా ఈ సినిమా అంత సక్సెస్ ని సాధించకపోయిన కూడా నాగార్జున స్టైల్ గాని, పూరి జగన్నాథ్ మేకింగ్ గాని ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో బైక్ స్టంట్స్ సన్నివేశాలను చిత్రీకరించారు… ఇక ఈ సినిమా ద్వారానే అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆమెతో పాటు ఆయేషా టాకీయా సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో అనుష్క వరుసగా తెలుగు సినిమాలను చేస్తోందని అందరు అనుకున్నారు. కానీ ఆయేషా టాకీయా మాత్రం సూపర్ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.
కారణమేంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెకు చాలా సినిమా ఆఫర్లు వచ్చినప్పటికి ఆమె తెలుగు మీద పెద్దగా ఆసక్తిని చూపించలేదు. కారణం ఏంటి అంటే సూపర్ సినిమా ఆమె అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దానివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు చేసిన ఇక్కడ పెద్దగా గుర్తింపు రాదని ఆమె బాలీవుడ్ కి తన మఖం మార్చేసింది.
మొత్తానికైతే బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలను చేయకుండా తన పర్సనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉంది… సూపర్ తర్వాత నాగార్జున మరో సినిమా కోసం అడిగిన కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఏది ఏమైనా కూడా తన అంద చందాలతో కుర్ర కారు మతులు పోగొట్టింది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
కానీ తర్వాత సినిమాలను చేయలేకపోయింది. ఇండస్ట్రీలో క్రేజ్ చాలా తక్కువ మందికి వస్తోంది. ఆ వచ్చిన ఇమేజ్ ను వాడుకొని మంచి సినిమాలు చేయాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఏ ఫార్ములాను ఫాలో అవుతూనే చాలా మంది నటి నటులు ముందుకు సాగుతుంటారు. అంతే తప్ప ఏవో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఫ్యూచర్ లేకుండా పోతోంది…