Pan India Industry: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కొంతకాలం నుంచి ఏ హీరో సినిమా వచ్చిన కూడా పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నప్పుడు బాలీవుడ్ నుంచి ‘సైయారా’ అనే మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించింది…ఆ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు మలయాళం ఇండస్ట్రీ నుంచి ‘కొత్తలోక్’ అనే సినిమా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మలయాళం లో ఇండస్ట్రీ హిట్ నిలిచింది… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది.
విజువల్ ఫీస్ట్ ని అందించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ కి అందరు ఫీదా అయిపోయారు. మొత్తానికైతే ఈ సినిమాతో తేజ సజ్జా ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి… ఇక వీటితో పాటుగా కన్నడ నుంచి వచ్చిన ‘కాంతార చాప్టర్ వన్’ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించింది.
ఇండియా వైడ్ గా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా అదరగొట్టాడు. మొత్తానికైతే ఆయన కాంతార సినిమాకు ఫ్రీక్వల్ గా ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు…ఇక కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పటివరకు 450 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది.
మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి రికార్డులను క్రియేట్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే గత రెండు నెలల వ్యవధిలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామం అనే చెప్పాలి…ఇకమీదట వచ్చే సినిమాలు కూడా ఇలానే సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగితే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది…