Snehal Kamat: ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ కు చాలా ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు కూడా వాటికే ఫ్యాన్స్ ఉన్నాకూడా ప్రస్తుతం షాట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఓటీటీలు వచ్చిన దగ్గర నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ మరింత ఎక్కువ అయింది. ఇక కామెడీ, హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఆడియన్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈటీవీ విన్ యాప్ లో అచ్చ తెలుగు వెబ్ సిరీస్ 90’s వచ్చిన సంగతి తెలిసిందే. ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మైమరిపిస్తుంది ఈ వెబ్ సిరీస్.
ఓ మధ్య తరగతి కుటుంబం పడే కష్టాలు, ఆ కుటుంబానికి పిల్లలు. ఇలా వారి మధ్యలో సాగుతున్న కష్టసుఖాలు, పిల్లల మనస్తత్వాలు అన్ని కూడా మన ఇంట్లో జరుగుతున్నట్టుగానే ఉంటుంది. అయితే 90’s పిల్లలు ఎవరున్నా సరే ఈ వెబ్ సిరీస్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇక కొన్ని వెబ్ సిరీస్, సినిమాల్లో కొందరు నటీనటులు మాత్రం కచ్చితంగా గుర్తుండిపోతారు. ఇందులో కూడా నటించిన ఓ అమ్మాయి కూడా అదే విధంగా గుర్తుండి పోయేలా నటించింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?
పెద్ద పెద్ద కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందాల మైన. మంచి నటన, హావభావాలతో ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేసింది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆమె ఎవరంటూ వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే ఈమె పేరు స్నేహల్ కామత్. తెలుగులో ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించింది. జీ ఫైవ్ లో గతంతో వచ్చిన కైలాసపురం వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది ఈమె. ఈ సిరీస్ కూడా మంచి విజయం అందుకుంది. అయితే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే ఫ్రెండ్ గా కూడా నటించింది. ఇవి మాత్రమే కాదు ఎన్నో యూట్యూబ్ సిరీస్ లలో కూడా నటించింది. కానీ ఈ 90’s సిరీస్ తో మాత్రం గుర్తుండి పోయే పాత్రను ఎంచుకుంది. దీంతో ఈమె దృష్టి అందరిపై పడింది. ఈ ఒక్క సిరీస్ వల్ల ఆమెకు మరిన్ని ఆఫర్లు రావడం పక్కా అనడంలో సందేహం లేదు.