Rajinikanth: స్నేహితుడి ప్రోత్సాహంతో బెంగుళూరు నుండి చెన్నైకి వచ్చిన రజినీకాంత్.. యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. శిక్షణ తీసుకుంటూ ప్రయత్నాలు చేసేవాడు. ఆఫర్స్ కొరకు ఆఫీసులు చుట్టూ తిరిగే రోజుల్లో రజినీకాంత్ కష్టాలు పడ్డారు. అవమానాలు చవి చూశారు. ఒక సినిమాలో రజినీకాంత్ కి ఛాన్స్ వచ్చిందట. ఆ మూవీ ప్రొడ్యూసర్ ని ఖర్చుల కోసం ఐదు వేలు అడ్వాన్స్ అడిగాడట. అడ్వాన్స్ ఇవ్వకపోతే సినిమా చేయవా, నువ్వు అంత పెద్ద నటుడివా.. అని అవమానించాడట.
ఆ సినిమాలో నుండి తీసేశాడట. కాగా లెజెండరీ దర్శకుడు కే బాలచందర్ ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించాడు. 1975లో విడుదలైన అపూర్వ రాగంగల్ మూవీలో మొదటి ఛాన్స్ ఇచ్చాడు. నటుడిగా ఎదిగే క్రమంలో రజినీకాంత్ విలక్షణ పాత్రలు చేశాడు. విలన్, సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు. 80ల నాటికి రజినీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక 90లలో రజినీకాంత్ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్ గా అవతరించాడు.
ఇక హీరోగా రజినీకాంత్ నెలకొల్పిన రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. దేశం లో ఫస్ట్ పాన్ ఇండియా అంటే రజినీకాంత్ నే. ప్రస్తుతం రజినీకాంత్ రెమ్యునరేషన్ రూ. 200 కోట్లకు పైమాటే. జైలర్ చిత్రానికి ఆయన రూ. 210 కోట్ల వరకు ఆర్జించారని సమాచారం. కానీ ఒకప్పుడు రజినీకాంత్ జీవితం చాలా దుర్భరం. హీరో కాకముందు రజినీకాంత్ బెంగుళూరులో కండక్టర్ జాబ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబ్ రాకముందు రజినీకాంత్ చాలా పనులు చేశాడట.
హోటల్ సర్వర్ గా సైతం చేశాడట. అనంతరం కార్పెంటర్ గా చేశాడట. కండక్టర్ జాబ్ రావడంతో జాయిన్ అయ్యాడట. స్కూల్ డేస్ నుండే నాటకాలు ఆడటం అలవాటున్న రజినీకాంత్ ని మిత్రులు ప్రోత్సహించారు. నీలో తెలియని ప్రత్యేకత, స్టైల్ ఉంది. సక్సెస్ అవుతావు. నటుడిగా ప్రయత్నం చేయమని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేసిన సూపర్ స్టార్ అయ్యాడు.
ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయడం కొసమెరుపు. కమల్ హాసన్ కి విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన.. రజినీకాంత్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఉత్కంఠ ఉంది.