Priyanka Nalkari: ప్రియాంక నల్కారి ఈ పేరు వింటే ముందుగా బుల్లితెర గుర్తుకు వస్తుంది. కోలీవుడ్ లో బుల్లితెరపై మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. సీతారామన్ అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించి రోజా సీరియల్ తో ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత సమ్ థింగ్ సమ్ థింగ్, కాంచన-3 సినిమాల్లోనూ కనిపించి మెరిసింది. ఇక టాలీవుడ్ లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఎస్ఎంఎస్, హైపర్, నేనే రాజు నేను మంత్రి, కిక్-2 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లాడి ఫ్యాన్స్ అందరికి షాక్ ఇచ్చింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను మలేషియాలో పెళ్లి చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ తన పెళ్లి గురించి తెలిపింది. అయితే ఈమె ప్రస్తుతం తమిళంలో నలదమయంతి అనే సీరియల్ లో లీడ్ రోల్ ను పోషిస్తుంది. కెరీర్ బాగానే ఉన్నా.. పర్సనల్ లైఫ్ బాలేనట్టు తెలుస్తోంది. ఈమె ఏడాది గడవకముందే తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.
గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నారట. స్వయంగా ఈమెనే ఈ విషయం తెలియజేయడంతో అభిమానులు విస్తు పోతున్నారు. అయితే ఆడియన్స్ తో ఇంటరాక్షన్ సెషన్ లో పాల్గొన్న ప్రియాంక తన భర్తతో విడిపోయినట్టు తెలిపింది. పెళ్లైన ఏడాది లోపే ఈమె విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది ప్రియాంక. అయితే మార్చిలో పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు కనీసం మార్చి వరకు అంటే వారి పెళ్లి రోజు వరకు కూడా కలిసి ఉండకపోవడం ఆశ్చర్యకరం.
పెళ్లి అయినా తర్వాత సీరియల్స్ కు దూరం అయినా ఈ అమ్మడు దానికి కారణం భర్తనే అని చెప్పింది. ఇక ఆ తర్వాత ఓ సీరియల్ లో నటించడానికి ప్రియాంక చెన్నైకి రావడంతో వీరి మధ్య మరింత దూరం పెరిగిందట. గొడవల వల్ల సీరియల్స్ కు స్వస్తి చెప్పిన ఈ బ్యూటీ తిరిగి నలదమయంతి అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక వీరిద్దరు గతంలో ఇన్ స్టాలో ఒకరి ఫోటోలు మరొకరు తీసేయడంతో ప్రేక్షకుల్లో ఈ అనుమానం వచ్చింది. కానీ చివరకు అది నిజమని తెలిపింది ప్రియాంక.