https://oktelugu.com/

Somasila: తెలంగాణ మాల్దీవులు.. తక్కువ ఖర్చుతో ఊహించని మధురానుభూతి.. ఎక్కడుందో తెలుసా?

మాల్దీవులు.. ప్రంచంలో అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. తక్కువ ఖర్చుతో వెళ్లొచ్చే దేశం కావడంతో భారత్‌ నుంచి చాలా మంది మాల్దీవులకు వెళ్లొస్తారు. గతేడాది భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 30, 2024 / 10:56 AM IST
    Follow us on

    Somasila: మాల్దీవులు.. ఈ పేరు వింటేనే అందరికీ స్వర్గంలో తెలిపోతున్నట్లు అనిపిస్తుంది. పర్యాటక ప్రియులు ఎక్కువగా ఇష్టపడే సుందరమైన ప్రదేశాల్లో మాల్దీవులు కూడా ఒకటి. మాల్దీవుల ప్రధాన ఆదాయ వనరు కూడా పర్యాటకమే. అందుకే ఆ దేశం యాత్రికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. భద్రతకు చర్యలు తీసుకుంటుంది. 2023లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మహ్మద్‌ మెయిజ్జు అధ్యక్షడు అయ్యారు. భారత వ్యతిరేయి అయిన మెయిజ్జు చైనాతో సన్నిహితంగా ఉంటూ భారత వ్యతరేక చర్యలకు మద్దతు తెలిపాడు. దీంతో ప్రధాని మోదీ గట్టి సాక్‌ ఇచ్చాడు. మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు ఇకపై లక్ష్యద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆయన స్వయంగా లక్ష్యద్వీప్‌లో పర్యటించి ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశారు. దీంతో మాల్దీవులు మంత్రులు మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారతీయులను మరింత ఇబ్బందిగా మారాయి. దీంతో మాల్దీవులు వెళ్లాలనుకునేవారంతా లక్ష్యద్వీప్‌బాట పట్టారు. దీంతో భారత్‌ నుంచి మాల్దీవులకు వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. నష్టాన్ని గుర్తించిన ఆదేశం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక ఇదిలా ఉంటే.. మాల్దీవులను తలపించే ప్రదేశం ఒకటి మన తెలంగాణలోనే ఉంది. తక్కువ బడ్జెట్‌లో వీకెండ్‌లో వెళ్లి.. మధురానుభూతి పొందిరావొచ్చు. దీనిని తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తున్నారు. ఎక్కడ ఎంది… ప్రత్యేకతలు ఏమిటి.. ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలుసుకుందాం.

    నాగర్‌కర్నూల్‌ జిల్లాలో..
    ఉమ్మడి పాలమూరు.. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం సోమశిల. దీనిని తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు. జాతీయ 6గామీణ పర్యాటక ప్రాంతంగా సోమశిలకు ఇటీవలే అవార్డు దక్కింది. హైదరాబాద్‌ నుంచి కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిదని. నదీ జలాలు, పచ్చని అడవుల మధ్య వీకెండ్‌ ట్రిప్‌కు ఎంతో అనువుగా ఉంటుంది.

    కమ్మనైన చేపలు..
    కృష్ణానది తీర ప్రాంతంలోని ఈ ప్రాంతం ఒక ద్వీపంగా మారింది. సోమశిల గ్రామంలో కృష్ణా బ్యాక్‌వాటర్‌ ఉండడంతో ద్వీపం వంటి అనుభూతి కలుగుతుంది. అందుకే దీనిని మినీ మాల్దీవులుగా పిలుస్తారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఇక్కడికి వచ్చే ప్యాటకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. బోటింగ్‌ సదుపాయం కూడా ఉంది. కృష్ణానది తీరంలో బోటింగ్‌తోపాటు ప్రత్యేకంగా వంటకాలు రుచి చూడవచ్చు. కమ్మనైన చేపల కూడా అందరినీ నోరూరిస్తుంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి బోట్‌లో వెళ్లొచ్చు. ఇక సోమశిలలో దాదాపు 15 ఆలయాలు ఉన్నాయి.

    ఇలా వెళ్లాలి..
    సోమశిల హైదరాబాద్‌ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్‌ హైవే 65 మీదుగా 3 నుంచి 4 గంటల ప్రయాణంతో అక్కడకు చేరుకోవచ్చు. నాగర్‌ కర్నూల్‌జిల్లా కోల్లాపూర్‌ మండలంలో ఈ గ్రామం ఉంది.

    ఇటీవలే సోమశిలకు ఉత్తమ పార్యాటక గ్రామ అవార్డు లభించింది.ఈ లిస్టులో నిర్మల్‌ కూడా ఉంది. దేశవ్యాప్తంగా 8 కేటగిరీలలో 36 గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణనుంచి కళాకృతుల విభాగంలో నిర్మల్, ఆధ్యాత్మిక, ఆరోగ్య విభాగంలో సోమశిలకు అవార్డులు దక్కాయి.