https://oktelugu.com/

Cannabis Choclates : వాట్ ఏ మైండ్.. గంజాయిని చాక్లెట్లు గా మార్చేశారు

అక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరికొత్త ఆలోచనతో గంజాయిని విక్రయించే వారు పెరుగుతున్నారు. పేరుకే చిన్న పాన్ షాప్. కానీ అక్కడ చూస్తే జనమే జనం. అయితే ఆ జనం చాక్లెట్ల కోసం ఎగబడుతుండడం విశేషం. అయితే అవి మామూలు చాక్లెట్లు కాదు. గంజాయి చాక్లెట్లు కావడమే జనం ఎగబడడానికి కారణం.

Written By:
  • Dharma
  • , Updated On : September 30, 2024 10:49 am
    Cannabis Choclates

    Cannabis Choclates

    Follow us on

    Cannabis Choclates :  గంజాయి పై నిఘా పెరగడంతో సరికొత్త వినియోగం తెరపైకి వస్తోంది. గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తోంది. విశాఖలో ఓ పాన్ షాప్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖలోని క్రాంతి థియేటర్ ఎదురుగా మనోజ్ కుమార్ చౌదరి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడు షాపులో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పాన్ షాప్ లో దాడులు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 133 గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిల్వలు పెద్ద ఎత్తున పట్టుబడుతుండగా..దాని మూలాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. అందుకే పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు.ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖపై ఫోకస్ పెట్టారు. సీరియస్ గా దృష్టి పెట్టారు.

    * రవాణాపై ఉక్కు పాదం
    ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపుతోంది. అందుకే గంజాయిని విక్రయించే గ్యాంగులు అనేక కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లు, లిక్విడ్ గంజాయి రూపంలో విక్రయాలు జరిపేవారు.తాజాగా చాక్లెట్ల రూపంలో విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే విశాఖ నగరంలో చాలాచోట్ల ఇదే మాదిరిగా చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.దీంతో తల్లిదండ్రులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. విశాఖ నగరంలో పాన్ షాపుల వద్ద యువత గుంపు గుంపులుగా కనిపిస్తారు.అందుకే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రజల్లో బలపడుతున్నాయి.

    * సీరియస్ గా పోలీసుల ఫోకస్
    ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిల్వలు పట్టు పడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని సీజ్ చేస్తున్నారు. మరోవైపు గంజాయి విక్రయించే వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయితో పట్టుపడితే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరిస్తున్నారు. అటువంటి వారి కదలికలపై కూడా దృష్టి పెడుతున్నారు. అయినా సరే గంజాయి రవాణా,వినియోగం ఆగడం లేదు.ప్రధానంగా విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని అన్ని నగరాలకు గంజాయి రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో పోలీస్ శాఖ కూడా.. అంతే సీరియస్ గా ఫోకస్ పెట్టింది.గంజాయి సాగు నియంత్రించడానికి… ఆ ప్రాంతంలో డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేపడుతున్నారు.గంజాయి సాగు, రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

    * ఉత్తరాంధ్రలో మూలాలు
    దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడుతున్న దాని మూలాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు అధికం. అమాయకులైన గిరిజనులను సమిధులుగా చేసుకుని గంజాయి రవాణా, విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.రైళ్లు, రోడ్డు మార్గాల్లో పెద్ద ఎత్తున గంజాయి తరలుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి విక్రయించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.