Interesting Facts About Oscar Awards: ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు.
మొత్తమ్మీద వెండితెర రంగుల సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది. మరి ఆ ఆస్కార్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Also Read: Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 మల్టీస్టారర్ సినిమాలు ఇవే..
‘ఆస్కార్ అవార్డ్’ ప్రతిమ దేనితో తయారు చేస్తారో తెలుసా ?
బంగారంతో అనుకుంటున్నారా ? కాదండోయ్. ఈ ప్రతిమ చూడటానికి బంగారంలా ఉంటుంది గానీ.. లోపల బంగారం ఉండదు. దీనిని కాంస్యంతో తయారు చేస్తారు. 24 క్యారెట్ బంగారంతో పూత పూసి..అందంగా ముస్తాబు చేస్తారు.
అసలు ఈ ప్రతిమ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది ?
50 ఆస్కార్ ప్రతిమలను తయారు చేయడానికి మూడు నెలల సమయం పడుతుంది. అంటే.. ఒక్కో ఆస్కార్ ప్రతిమ చేయడానికి సుమారు 52 గంటలు పడుతుంది.
ఇంతకీ ప్రతిమ విలువ ఎంత ఉంటుందో తెలుసా ?
‘వెండితెర’ కలల స్వప్నం కాబట్టి.. కోట్లలో ఉంటుందనుకుంటున్నారా ? అంత లేదు. దీని విలువ వేయి రూపాయలు కూడా లేదు. ఈ ప్రతిమ పసిడి వర్ణంలో మిలమిల మెరిసిపోతున్నప్పటికీ, దాని విలువ కేవలం ఒక అమెరికా డాలర్ మాత్రమే. కానీ, అవార్డు గ్రహీతలు దీన్ని అమ్మడానికి కుదరదు. అకాడమీని సంప్రదించకుండా ఈ అవార్డును అమ్మకూడదు అట.
ఇప్పటి వరకూ ఎక్కువ సార్లు ఆస్కార్ అందుకున్న సినిమా ఏమిటి ?
మూడు సినిమాలు అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాయి.
బెన్-హర్ (1959),
టైటానిక్ (1997),
ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ (2003).. ఈ మూడు చిత్రాలు 11 చొప్పున ఆస్కార్లను అందుకున్నాయి.
ఆస్కార్ చరిత్రలోనే ఎక్కువ అవార్డులు అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా ?
ఓ వ్యక్తి ఆస్కార్ లో 22 సార్లు విజేతగా నిలిచారు. ఆయనే వాల్ట్ డిస్నీ. యానిమేషన్ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు వాల్ట్ డిస్నీ.
నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరీలో అత్యధిక సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న దేశం ఏమిటో తెలుసా ?
ఇటలీ. అవును, నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఇటలీ ఇప్పటివరకు 14 సార్లు ఈ అవార్డు అందుకుని రికార్డు క్రియేట్ చేసింది.
మరణించిన తర్వాత ఆస్కార్ అందుకున్న కళాకారులు ఎవరో తెలుసుకోవాలని ఉందా ?
ఆస్కార్ చరిత్రలో కేవలం ఇద్దరు కళాకారులకు మాత్రమే ఇలా జరిగింది. 1976లో బ్రిటిష్ నటుడు పీటర్ ఫించ్ కి, ఆస్ట్రేలియన్ నటుడు హీత్ లెడ్జర్‌కు,
ఆస్కార్ గెలుచుకున్న మహిళా డైరెక్టర్లు ఎవరు?
ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ‘బెస్ట్ డైరెక్షన్’ కేటగిరీలో అవార్డు అందుకున్నారు.
‘ఫియర్ జోన్’ సినిమాకు అమెరికా డైరెక్టర్ బిగ్లో,
నోమ్యాడ్‌ల్యాండ్ సినిమాకు చైనాకు చెదిన చో జావో,
‘ది పవర్ ఆఫ్ గాడ్’ సినిమాకు జాన్ కాంపియాన్ ఈ అవార్డును అందుకున్నారు.
ఎక్కువసార్లు ఆస్కార్ పొందిన నటీమణి ఎవరో తెలుసా ?
అమెరికాకు చెందిన కేథరీన్ హాప్‌బర్న్, ఇవ్వండీ ఆస్కార్ గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు.
Also Read: NTR Fans Negative Comments On Rajamouli: రాజమౌళి పై విరుచుకుపడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
Recommended Video: