Bollywood Hero: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషకం అందుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న సంపన్న నటులలో ఇతను కూడా ఒకరిగా మారిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లే కాకుండా సహాయక పాత్రలలో నటించిన నటులు కూడా తమ నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఈ నటులలో చాలామంది ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లే. తమ స్వయం టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు చాలా మంది స్టార్స్ గా ఎదిగారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు కూడా ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. వాచ్మెన్ గా కూడా పనిచేశాడు. కెమిస్ట్ గా కూడా పనిచేసేవాడు. కూరగాయలు అమ్మడం ఇలా ఎన్నో రకాల పనులను ఒకప్పుడు ఈ నటుడు చేసేవాడు. ఆ సమయంలోనే ఇతను సినిమా ఆడిషన్స్ కు వెళ్ళాడు. కానీ ప్రారంభంలో ఎన్నో తిరస్కరణలు చవిచూశాడు. కానీ పట్టుదలతో ప్రయత్నించి ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశం అందుకున్నాడు. ప్రారంభంలో ఎటువంటి మొహమాటం లేకుండా ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర చేసుకుంటూ వెళ్ళాడు.
ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి అవకాశం అందుకున్న తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెర్స టైల్ నటులలో ఇతను కూడా ఒకరు. ఇతను హిందీ తో పాటు తెలుగు, తమిళ్లో కూడా ఎన్నో సినిమాలలో నటించాడు. తన డిమాండ్ కు తగినట్టుగానే కోట్లలో పారితోషకం అందుకుంటున్నాడు. ఈ నటుడి ఆస్తి ప్రస్తుతం 200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన ఈ నటుడు ప్రస్తుతం రాజభవనం లాంటి ఇల్లు, లగ్జరీ కార్లు వంటివి ఆస్వాదిస్తూ లగ్జరీ లైఫ్ ను జీవిస్తున్నాడు. ఈ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి. నవాజుద్దీన్ సిద్ధికి రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో విలన్ గా నటించాడు.
ఈ మధ్యకాలంలో ఇతను పలు సౌత్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నవాజుద్దీన్ సిద్ధిఖి తన సినిమా ప్రయాణం గురించి,తన జీవితంలో పడిన కష్టాల గురించి పంచుకున్నాడు. తను వడోదరలో ఒక నాటకం చూసిన సమయంలో తనకు మొదటిసారి నటన అభివృద్ధి కలిగిందని తెలిపాడు. అలాగే తన కుటుంబంతో కలిసి రాంలీలా నాటకం చూసే వాళ్ళం అని కూడా పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఆ విధంగా తనకు నాటకంలో ఆసక్తి కలిగిందని తన స్నేహితుడు ఒకరు రాం పాత్ర పోషించాడని, వేదికపై తన స్నేహితుడిని చూసి తను ఆశ్చర్యపోయినట్లు నవాజుద్దీన్ సిద్దేకి చెప్పుకొచ్చాడు.