Rimi Sen: ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను నిరాశపరచడంతో ప్రస్తుతం అందరి ఆశలు విశ్వంభర సినిమా మీదనే ఉన్నాయి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి తన కెరియర్ లోని నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అందరివాడు సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అందరివాడు సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాలో టబు, రీమిసేన్ హీరోయిన్లుగా కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో టీవీ ఛానల్ రిపోర్టర్గా అలాగే మేస్త్రిగా ద్విపాత్రాభినయం చేసి చిరంజీవి ప్రేక్షకులను మెప్పించారు. ఇక అందరివాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ రీమి సెన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది.అందరివాడు సినిమాలో చిరంజీవి మరియు రిమి సెన్ మధ్య జరిగే కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందరివాడు సినిమా తర్వాత ఈమె తెలుగులో మరొక సినిమాలో కనిపించలేదు. దాంతో ప్రస్తుతం రిమీ సేన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఈమె ఎక్కువగా హిందీ మరియు బెంగాలీ సినిమాలలో నటించింది. ఈమే అసలు పేరు శుభమిత్ర సేన్.
చిన్నప్పటి నుంచి తనకు నటనపై ఆసక్తి ఉండడంతో తన చదువు పూర్తయిన తర్వాత ఆమె కోల్కతా నుంచి సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చింది. కెరియర్ ప్రారంభంలో స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కోకా కోలా ప్రకటనలో కనిపించింది. టాలీవుడ్ లో 2001లో రిలీజ్ అయిన ఇదే నా మొదటి ప్రేమలేఖ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హిందీలో రీమీ సెన్ ధూమ్, క్యూన్ కి, గరం మసాలా, గోల్మాల్ వంటి భారీ హిట్ సినిమాలలో నటించింది. అలాగే ఈ బ్యూటీ 2015 లో బిగ్ బాస్ రియాల్టీ షో లో కూడా పాల్గొంది. తెలుగులో మాత్రం ఇదే నా మొదటి ప్రేమలేఖ, నీ తోడు కావాలి, అందరివాడు వంటి సినిమాలలో కనిపించింది. ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండే రీమీ సెన్ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.