Naveen Chandra: స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో నటులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు… హీరోలతోపాటు విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే నటులకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఒకప్పుడు రావు గోపాల్ రావు, జగ్గయ్య లాంటి నటులకు చాలా గౌరవమైతే దక్కింది. అలాగే ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు సైతం సక్సెస్ ఫుల్ నటులుగా గుర్తింపు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు.
Also Read: భరణి పై కక్ష్య గట్టిన పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్..కన్నింగ్ ఆలోచనలతో గెలిచిన రీతూ!
ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర సైతం అటు హీరోగా నటిస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటుతున్నాడు…ఇక ప్రస్తుతం ఆయన చాలా కాలం నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు, దోశలు తినకుండా చద్దన్నం తింటున్నాడట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చాడు. చద్దన్నం తినడం వల్ల తనకు హెల్త్ చాలా బాగుంటుందని అదొక డిఫరెంట్ టేస్ట్ అని చెప్పాడు.
రాత్రి మిగిలిపోయిన అన్నం లో పెరుగు కలుపుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే లేచి అందులో మంచింగ్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని తింటూ ఉంటాడట. దీని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందని ఆయన చెప్పాడు. అలాగే అప్పుడప్పుడు గంజి తాగుతూ దాన్ని కూడా టేస్ట్ చేస్తూ ఉంటాడట. మొత్తానికైతే ఇడ్లీలు, దోశలు తిని గ్యాస్ ట్రిక్ ప్రాబ్లమ్స్ ని తెచ్చుకునే కంటే ఇవి తినడం చాలా ఉత్తమం అంటూ ఆయన చాలా మందికి సలహాలను ఇస్తున్నాడు…
ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీ అయిపోయాడు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికి అతనికి పెద్దగా సక్సెస్ దక్కలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఓటీటీ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ఓటీటీ హీరోగా రాణిస్తున్నాడు…