Nandamuri Harin Chakravarthi: పౌరాణికం అంటే ఆయన, పాలిటిక్స్ చేయాలంటే ఆయన, నటనలో ఎదురులేని మనిషి అంటే ఆయన.. ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ ఎన్టీఆర్ గురించి పదాలే చాలవు. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఈ తరం వారికి కూడా తెలుసు. ఆయన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు సినిమా పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.
ఆయన అందరి మధ్య లేకున్నా.. ఆయన నటించిన సినిమాల ద్వారా..ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉన్నారు. ఈయన గురించి ఏదైనా చిన్న విషయం తెలిసినా ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణ మంచి పేరు సంపాదించారు. ఇక వీరి కుమారులు అంటే ఎన్టీఆర్ కు మనవళ్లు చైతన్య కృష్ణ, తారక రత్న, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మూడవ తరం నటులుగా నట వారసత్వాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే చాలా మందికి తెలియని మరో విషయం కూడా ఉంది. ఎన్టీఆర్ కు మరో సోదరుడు ఉన్నాడట. ఆయన కూడా కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించారట. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా పనిచేశారు. కళ్యాణ్ చక్రవర్తి, హరీన్ చక్రవర్తి వీరిద్దరు త్రివిక్రమ్ రావు కుమారులే. కళ్యాణ్ చక్రవర్తి సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించారు. ఆయన సోదరుడు హరీన్ చక్రవర్తి కూడా మంచి పేరు సంపాదించాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈయన కొన్నిసినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మనుషుల్లో దేవుడు సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీన్ 1986లో మామ కోడళ్ళ సవాల్ సినిమాతో యాక్టర్ గా చేశారు. ఆ తర్వాత పెళ్లికొడుకులొస్తున్నా సినిమాలో యముడిగా నటించి మంచి మార్కులు సంపాదించారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఈయన మరణించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.