Mughal-E-Azam:‘భారత్ లో మొఘల్-ఎ-అజామ్’ ను మించిన సినిమా వచ్చిందా?

ప్రస్తుత కాలంలో ఒక భారీ చిత్రం రూ.300 నుంచి రూ.400 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు. కొన్ని సినిమాలు రూ.1000 కోట్లను కూడా అధిగమించాయి. వాస్తవానికి 90వ దశకం చివరి నాటికి రూ.50 నుంచి రూ.100 కోట్లు సాదించడం కష్ట సాధ్యమైంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా స్క్రీన్ల సంఖ్య పెరగడం, విదేశాల్లో రిలీజ్ కావడంతో పాటు టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పైన చెప్పిన ఆదాయం రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మొఘల్-ఎ-అజామ్ ఘనత పదేళ్లపాటు కొనసాగింది.

Written By: Chai Muchhata, Updated On : June 10, 2023 12:18 pm

Mughal-E-Azam

Follow us on

Mughal-E-Azam: మొఘల్-ఎ-అజామ్.. 1960లో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సినీ ఇండస్ట్రీలో ఆ కాలంలోనే రికార్డు వసూళ్లు నమోదు చేసిన ఈ మూవీ ఆల్ టైం రికార్డు నమోదు చేసుకుంది. అయితే ఇప్పుడు రిలీజైన కొన్ని సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. కానీ మొఘల్-ఎ-అజామ్..1960లో చేసిన వసూళ్ల కంటే తక్కువేనని కొందరు సినీ రంగానికి చెందిన వారు అంటున్నారు. ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాలు సైతం అత్యధిక వసూళ్లు చేశాయని చెబుతున్నారు. బాహుబలి, దంగల్ లాంటి సినిమాలు ఎన్ని కోట్లు వసూళ్లు చేసినా మొఘల్-ఎ-అజామ్.. ముందు తక్కువేనని అంటున్నారు. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో ఒక భారీ చిత్రం రూ.300 నుంచి రూ.400 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు. కొన్ని సినిమాలు రూ.1000 కోట్లను కూడా అధిగమించాయి. వాస్తవానికి 90వ దశకం చివరి నాటికి రూ.50 నుంచి రూ.100 కోట్లు సాదించడం కష్ట సాధ్యమైంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా స్క్రీన్ల సంఖ్య పెరగడం, విదేశాల్లో రిలీజ్ కావడంతో పాటు టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పైన చెప్పిన ఆదాయం రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మొఘల్-ఎ-అజామ్ ఘనత పదేళ్లపాటు కొనసాగింది.

1960లో మొఘల్-ఎ-అజామ్ రిలీజ్ అయింది. ఆ కాలంలో బాక్సాపీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ రూ.11 కోట్ల లాభం వచ్చింది. గ్రాస్ కలెక్షన్లు అప్పట్లోనే రూ.3650 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియా వైడ్ గా 150 థియేటర్లలో రిలీజై హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగింది. ఆ కాలంలో బ్లాక్ టికెట్ల విక్రయానికి కూడా డిమాండ్ ఉండేది. అప్పుడే ఒక్కో టికెట్ కు రూ.100 వసూలు చేశారు. ఇప్పుడు అది రూ.4000తో సమానం.

భారత్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల గురించి చెప్పినప్పుడు ఏవైనా మొఘల్-ఎ-అజామ్ తరువాతనేనని అంటున్నారు. ఈ మూవీ తరువాత వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’ రూ.2800 కోట్లు వసూలు చేసింది. అమీర్ ఖాన్ నటించిన రూ.2650 కోట్లు సాధించింది. ఆ తరువాత బాహుబలి రూ.2120 కోట్లు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా మదర్ ఇండియా, రూ.2120, హమ్ ఆప్ హే కోన్ రూ.2100 కోట్లు వసూలు చేసింది. మిథున్ చక్కవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు సాధించినా.. రష్యా నుంచి రూ.94 కోట్లు సాధించిన మూవీగా నిలిచింది.

ఒక సినిమా కాలం మారిన కొద్దీ ఎంత వసూళ్లు చేస్తుందో తెలుపుతుంది. కానీ భారత్ కు చెందిన మొఘల్-ఎ-అజామ్ ను మించిన సినిమా ఇప్పటికీ రాలేదని ఇండస్ట్రీ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు నిర్మీతమవుతున్నాయి. స్క్రీన్లు భారీగా పెరిగాయి. కానీ ఎలాంటి సదుపాయాలు లేని ఆ కాలంలో మొఘల్-ఎ-అజామ్, షోలే లు అద్భుత విజయాలు సాధించడంతో పాటు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలుగా నిలిచాయి.