Star Hero: ఒకప్పుడు థియేటర్ల బయట పల్లీలు అమ్ముకునే ఈ వ్యక్తి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ స్టార్ హీరో సినిమాలను చూసేందుకు థియేటర్ల బయట జనం క్యూ కట్టారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇతను సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కోట్లాది ఆస్తులు కూడబెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడికి గుర్తింపు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందులోనూ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వాళ్ళు మరింత శ్రమించాలి. అవకాశాలు వచ్చేవరకు ఎంతో ఓర్పుతో, సహనంతో ఉండాలి. అప్పుడే తమ కలలను నెరవేర్చుకోవచ్చు. ఈ నటుడుకి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇతనికి సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ కూడా లేడు. కానీ తన కఠోర శ్రమతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగాడు. సినిమా థియేటర్ల బయట ఈ నటుడు ఒకప్పుడు వేరుశనగ పల్లీలను అమ్మేవాడు. కానీ అదృష్టం కలిసి రావడంతో అదే థియేటర్లలో ఈ హీరో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇతను మరెవరో కాదు బాలీవుడ్లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న నటుడు జాకీ షరాఫ్. బాలీవుడ్ ప్రేక్షకులకు జాకీ షరాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతనిని జగ్గు దాదా అని కూడా అంటారు. తన టాలెంట్ తో, అద్భుతమైన నటనతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు జాకిషరాఫ్. ఇతను ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన గురించి బాగా తెలుసు. జాకీ షరాఫ్ తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన అస్త్రం, పవన్ కళ్యాణ్ నటించిన పంజా, ఎన్టీఆర్ హీరోగా చేసిన శక్తి, ప్రభాస్ సాహో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.
ఈయన 1957, ఫిబ్రవరి 1న జన్మించారు. ఇటీవలే జాకీ షరాఫ్ 68వ ఏటా అడుగుపెట్టారు. ఈయన చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలా ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ జాకీ షరాఫ్ ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు థియేటర్లో బయట వేరుశనగ పల్లీలు అమ్మేవాడని, సినిమాల పోస్టర్లు అంటించేవాడని చాలామందికి తెలియదు. కానీ చాలా కాలం పాటు ఈయన ఈ పనులు చేశాడు. ఆ తర్వాత అతనికి ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న సమయంలో మోడలింగ్ రంగంలో ఆఫర్ వచ్చింది. తన మొదటి ఉద్యోగానికి ఇతను 7000 జీతం అందుకునేవాడు.

ఆ తర్వాత మోడల్ ఇంట్లోనే పని చేస్తున్న సమయంలో జాకీ కి దేవ్ ఆనంద్ కొడుకు సునీల్ ఆనంద్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జాకీ దేవ్ ఆనంద్ ని కలవడంతో అతనికి సినిమా ఆఫర్ చేశాడు దేవ్ ఆనంద్. జాకీ ని సుభాష్ భాయ్ హీరోగా చేశారు. ఆ తర్వాత జాకీ షరాఫ్ కు వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.. ప్రస్తుతం ఆయన కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక అతని తనయుడు టైగర్ షరాఫ్ కూడా బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. జాకీ షరాఫ్ కూతురు కృష్ణ కూడా వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.