Simbu: సినిమా ఇండస్ట్రీలో లవ్ చేసుకోవడం.. ఆ తరువాత బ్రేకప్ కావడం కామన్.. ఇలా బ్రేకప్ చేసుకున్నవాళ్లు ఎవరికి వారు మరొకరిని చూసుకొని సెటిలైపోవడం ఇంకా కామన్.. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఒకరు.. కాదు.. ఇద్దరు కాదు.. పలువురు హీరోయిన్లతో లవ్ పేరు చెప్పి ముద్దు ముచ్చట్లకు వరకు వెళ్తున్నాడు. కొందరితో ప్రైవేట్ గా కూడా కలిసుంటూ వారికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టాడు. ఆ తరువాత నీకు నాకు చెల్లు.. అని వాడుకొని వదిలేస్తున్నాడు. ఈ హీరో మాయలో పడిన వాళ్లు కూడా ఎందుకీ రభస.. అనుకొని చడీ చప్పుడు లేకుండా ఇతరులను చూసుకున్నారు. లేటెస్టుగా ఈ లవర్ భాయ్ మరో స్టార్ హీరోయిన్ ను పట్టేశాడు. ఆమెతో లవ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈమెతో ఎన్నిరోజులు సరసాలు చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్న ఆ నటి కెరీర్ ఏం గానూ..? అని అనుకుంటున్నారు.

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు శింబు సినిమాలంటే యూత్ లో యమ క్రేజ్. తమిళంలో హిట్టు కొట్టిన ‘మన్మథ’ అనే మూవీని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ సినిమా అయినా ఇది అప్పట్లో మంచి హిట్టుకొట్టింది. దీంతో శింబు తెలుగులో కూడా స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచి లవర్ భాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. శింబు సినిమాల్లోనే కాదు.. రియల్ గా కూడా లవర్ భాయ్ గా మద్రపడిపోయాడు. మన్మథ సినిమా తరువాత ‘వల్లభ’ అనే మూవీ వచ్చింది. ఇందులో నయనతార కథానాయక. ఈ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో ఇద్దరూ లవ్లో పడిపోయారు.
ఆ తరువాత ఓ హోటల్ లో ప్రైవేట్ గా కలిసున్న ఫొటోలూ బయటకు వచ్చాయి. నయనతారకు లిప్ లాక్ చేసిన ఫొటో అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ కొన్ని రోజుల తరువాత వీరు బ్రేకప్ చెప్పుకొని ఎవరికి వారు విడిపోయారు. ఇక ఖాళీగా ఉండడమెందుకని శింబు హన్సికకు వల వేశాడు. మనోడి చేష్టలకు ఆ యంగ్ హీరోయిన్ తొందరగానే ఫిదా అయిపోయింది. శింబుతోనే తన జీవితం అనుకుంది. దీంతో ఆయనతో చెట్టాపట్టాలు వేసుకొని హోటళ్ల వెంట తిరిగింది. వీరి ఫొటోలు కూడా మీడియాకు దొరకడంతో ఈసారైనా వీరు దండలు మార్చుకుంటారని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఈమెను కూడా వాడుకొని వదిలేశారు.

ఇక ఇప్పుడు శింబు మాయలో మరో స్టార్ హీరోయిన్ పడింది. ఆమె ఎవరో కాదు. ‘మహానటి’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేశ్. ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో కీర్తి బిజీగా మారింది. స్టార్ హీరోలతో నటిస్తూ మంచి పొజిషన్లో ఉంది. కానీ ఇదే సమయంలో శింబు ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి డిన్నర్ కు కూడా వెళ్లారట. ఇప్పటికే ఇద్దరి జీవితాలతో ఆడుకున్న శింబును ఇప్పుడు కీర్తి సురేశ్ ఎలా నమ్మింది..? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న కీర్తికి శింబుతో ప్రేమాయణం నడిపిస్తే అవకాశాలకు గండిపడొచ్చని అంటున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..