Good Night Movie: ఈమధ్య సినీ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా.. ఏ భాషలో మంచి కథ వచ్చినా చాలు అభినందిస్తున్నారు. ఇక ఇలా ఈమధ్య భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ టాక్ చేసుకున్న సినిమా గుడ్ నైట్. తమిళంలో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.
ఒక సినిమా సూపర్ హిట్ కావాలి అంతే భారీ బడ్జెట్ లేదా సెట్టింగ్స్ తప్పక ఉండాలి అనేది నిజం కాదని తేల్చింది ఈ సినిమా. కేవలం ప్రేక్షకులను రెండున్నర గంట ఎంటర్‌టైన్ చేసే కథ, కథనం ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మరోసారి గుడ్ నైట్ సినిమా రుజువు చేసింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు.
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అల్లరిస్తోంది. ఈ సినిమా కథ ‘గురక’ అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది.
కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కి గురక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అతను నిద్రపోయాడంటే అయిన గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు. అయితే మోహన్ కి అనుకోని పరిస్థితుల్లో అను అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళుతుంది. ఇక పెళ్లి జరిగిన తర్వాత మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథాంశం.
ఇలా హీరోకి ఏదో ఒక సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. గురక సమస్యతో హీరో బాధపడటం.. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా నవ్విస్తూ అలానే మనల్ని ఆకట్టుకుంటూ సినిమాని చాలా బాగా తీశారు డైరెక్టర్.
మొత్తానికి ఇలాంటి కథతో కూడా సినిమా తీసి సూపర్ హిట్ అందుకోవచ్చు అని ఈ సినిమా రుజువు చేసింది. అంతే కాదు కొత్త కథలతో రాబోయే దర్శకులకు కూడా ఈ సినిమా స్ఫూర్తినిచ్చింది ఆనడం లో సందేహం లేదు.