Daggubati Raja: అప్పటి ముచ్చట్లు: సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… ఈయన వెంకీ బంధువని తెలుసా?

రామానాయుడు బ్రదర్ కొడుకైన దగ్గుబాటి రాజా డెబ్భైకి పైగా చిత్రాల్లో నటించారు. దగ్గుబాటి రాజా మొదటి చిత్రం పక్కు వెతలై. ఈ తమిళ చిత్రం 1981లో విడుదలైంది. అక్కడి నుండి వరుసగా తమిళంలో హీరోగా చిత్రాలు చేశారు.

Written By: Shiva, Updated On : April 26, 2023 6:40 pm
Follow us on

Daggubati Raja: చిన్న కుగ్రామంలో పుట్టిన దగ్గుబాటి రామానాయుడు మూవీ మొఘల్ గా అవతరించారు. చిత్ర నిర్మాణంలో తిరుగులేని కింగ్ గా ఎదిగారు. అనేక భాషల్లో చిత్రాలు నిర్మించారు. ఆయన వారసులైన సురేష్ బాబు, వెంకటేష్ పరిశ్రమలోనే నిలదొక్కుకున్నారు. వెంకటేష్ స్టార్ హీరో కాగా, సురేష్ బాబు తెలివైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. సురేష్ బాబు కుమారుడు రానా పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో మరో హీరో ఉన్నారు. ఆయన ఒకప్పుడు కోలీవుడ్ హీరోగా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్నారు.

రామానాయుడు బ్రదర్ కొడుకైన దగ్గుబాటి రాజా డెబ్భైకి పైగా చిత్రాల్లో నటించారు. దగ్గుబాటి రాజా మొదటి చిత్రం పక్కు వెతలై. ఈ తమిళ చిత్రం 1981లో విడుదలైంది. అక్కడి నుండి వరుసగా తమిళంలో హీరోగా చిత్రాలు చేశారు. ఆయన నటించిన మొదటి తెలుగు చిత్రం వైదేహి. అనంతరం సిరిపురం చిన్నోడు, ఝాన్సీరాణి, సంకెళ్లు చిత్రాల్లో నటించారు. రాజా అత్యధికంగా తమిళంలో చిత్రాలు చేశారు. అయితే ఆయన స్టార్ కాలేకపోయారు.

సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయారు. దీంతో 1998 తర్వాత పూర్తిగా పరిశ్రమకు దూరమయ్యాడు. దగ్గుబాటి రాజా తండ్రి చెన్నైలో గ్రానైట్ వ్యాపారం చేసేవారు. యాక్టింగ్ వదిలేసి పూర్తి దృష్టి వ్యాపారం మీద పెట్టాడు. ఈ సంస్థ పేరు కాస్మో గ్రానైట్స్. తండ్రి మొదలుపెట్టి వ్యాపారంలో దగ్గుబాటి రాజా బాగా అభివృద్ధి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన కోట్లకు పడగలెత్తారట. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వ్యాపారం ఓ స్థాయికి చేరాక మరలా ఆయన నటన వైపు అడుగులు వేశారు.

కేవలం తనలోని తృష్టను తీర్చుకునేందుకు సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ చేసిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో దగ్గుబాటి రాజా నటించారు. అలాగే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ మూవీలో ఓ కీలక రోల్ చేశారు. గత ఏడాది విడుదలైన ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ మూవీలో ఆయన నటించారు. కెరీర్ ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా రాజా రామానాయుడు సప్పోర్ట్ తీసుకోలేదని సమాచారం. తన ప్రతిభ ఆధారంగా దక్కిన సినిమాలు చేస్తుకుంటూ వచ్చారు. చక్కని రూపం కలిగిన రాజా ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ కావాలని అనుకుంటున్నారు.