https://oktelugu.com/

Mallikarjuna Rao: కమెడియన్ మల్లికార్జున రావు గుర్తున్నాడా..? ఈయన భార్య పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారో..ఏమి చేస్తున్నారో తెలిస్తే ఏడుపు ఆపుకోలేరు!

నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన ఈయన వంశీ తెరకెక్కించిన 'లేడీస్ టైలర్' అనే చిత్రం లో 'బట్టల సత్యం' అనే పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. 1981 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'కిరాయి రౌడీలు' అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 29, 2024 / 05:56 PM IST

    Mallikarjuna Rao

    Follow us on

    Mallikarjuna Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ ఏ ఇండస్ట్రీ లో కూడా లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చనిపోయిన తర్వాత ఒకానొక సమయంలో హీరోలను, హీరోయిన్లను, రాజకీయ నాయకులను అయినా మర్చిపోతారేమో కానీ, కమెడియన్స్ ని మాత్రం మర్చిపోలేరు. ఎందుకంటే రోజంతా కష్టపడి పని చేసి, కాసేపు వినోదం కోరుకునే వాళ్ళు యూట్యూబ్ ముందు కూర్చొని కమెడియన్స్ కి సంబంధించిన కామెడీ సన్నివేశాలనే చూస్తారు. బ్రహ్మానందం, ఏంఎస్ నారాయణ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ ఇలా ఒక్కరా ఇద్దరా, ఎంతోమంది ఉన్నారు. కానీ జనాల్లో తమ హాస్యంతో బలమైన ముద్ర వేసిన కొంతమంది కమెడియన్స్ మాత్రం అండర్ రేటెడ్ క్యాటగిరీలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మల్లికార్జున రావు గారు. ఈయన మన టాలీవుడ్ లో ఉన్న గొప్ప హాస్య నటులలో ఒకరు. ఎక్కువగా ప్రముఖ దర్శకుడు వంశీ తెరకెక్కించే సినిమాలలో నటించాడు.

    నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన ఈయన వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’ అనే చిత్రం లో ‘బట్టల సత్యం’ అనే పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. 1981 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘కిరాయి రౌడీలు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత చిరంజీవి హీరో గా నటించిన ‘మంచు పల్లకి’ అనే చిత్రంలో ఈయన ఒక ఫిలిం డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రం నుండి స్వాతి ముత్యం వరకు ఈయనకి పాత్రలు అయితే బాగానే దొరుకుతున్నాయి కానీ, జనాలు గుర్తించుకోదగ్గ పాత్రలు మాత్రం పడలేదు. అలాంటి సమయంలో ఆయనకీ ‘లేడీస్ టైలర్’ చిత్రంలో ‘బట్టల సత్యం’ పాత్ర దొరకడం అదృష్టం అనే చెప్పాలి. ఈ క్యారక్టర్ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే మధ్యలో ఆయన చెన్నై లో చాలా కాలం వరకు స్థిరపడిపోయాడు.

    చిరంజీవి తో మల్లికార్జున రావు కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతో చిరంజీవి ఈయన వద్దకు వెళ్లి నీలాంటి నటుడు చెన్నై కి పరిమితం అవ్వడం కరెక్ట్ కాదు. మన సినిమాల్లో నటించాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేయ్ అని ప్రోత్సహించడంతో మళ్ళీకార్జున రావు గారు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకీ ఎన్నో మంచి పాత్రలు దక్కాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం తమ్ముడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు మల్లికార్జునరావు కి నంది అవార్డు కూడా వచ్చింది. అలా ఎన్నో గుర్తించుకోదగ్గ పాత్రలు పోషించిన ఈయన 2008 వ సంవత్సరం లో లుకేమియా వ్యాధితో చనిపోయాడు. ఈయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ దూరంగా బ్రతుకుతున్నారు. వ్యాపార రంగంలో మంచిగానే రాణిస్తున్నారు కానీ, మల్లికార్జున రావు లాంటి లెజెండరీ కమెడియన్ లేజసి ని కొనసాగించే వారసులు ఇండస్ట్రీ లోకి లేకపోవడం ఆయన అభిమానుల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది.