Athadu: త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి…నిజానికి ఈయన సినిమాల్లో చేసిన హీరోలకి ఒక మంచి ఇమేజ్ అయితే వస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, మహేష్ బాబు తో మూడు సినిమాలు చేసి ఉన్నాడు. అయితే ఈయన కెరియర్ మొదట్లో రైటర్ గా వచ్చి తన స్టోరీలతో మంచి హిట్లు అందుకున్నాడు. నిజనికి ఈయన రాసిన చాలా సినిమాల స్టోరీ లు మంచి విజయాలను అందుకున్నాయి.ముఖ్యంగా డైరెక్టర్ విజయ భాస్కర్ డైరెక్షన్ లో ఈయన రాసిన చాలా స్టోరీ లు మంచి విజయాలను అందుకున్నాయి.అందుకే ఈయనకి స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఏర్పడింది…
ఇక ఆ తరువాత ఈయన తరుణ్ ని హీరో గా పెట్టి నువ్వే నువ్వే అనే సినిమా తీసాడు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు హీరో గా అతడు అనే సినిమా చేసాడు ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది.అయితే అతడు సినిమాలోని ఒక సీన్ ని త్రివిక్రమ్ కాపీ చేసాడు అనే విషయం చాలా మంది కి తెలీదు అదేంటంటే మహేష్ బాబు ఊరికి వచ్చాక పంతులు దగ్గరికి వెళ్లి వాళ్ల ఇంట్లో చెట్ల దగ్గర పైసలు వేసే సీన్ ఒక బుక్ లో నుంచి త్రివిక్రమ్ కాపీ చేసాడు ఇంతకు అది ఏ బుక్ అని అనుకుంటున్నారా…అప్పట్లో మధుబాబు రైటర్ గా చాలా నవల్స్ వచ్చేవి అందులో షాడో పేరుతో కొన్ని బుక్స్ వచ్చేవి ఇలా షాడో అనే బుక్ లోనే యముడు అనే ఒక బుక్ కూడా వచ్చింది దాంట్లో నుంచే ఈ సీన్ ని కాపీ చేసాడు త్రివిక్రమ్…ఇక ఈ బుక్ లో షాడో అతని అసిస్టెంట్ ఇద్దరు కూడా రాత్రి వేళలో ఒక ముసలి దంపతుల దగ్గర అన్నం తింటారు వాళ్ళు చాలా పేదరికం లో ఉంటారు.అయితే చేతికి సాయం గా ఇస్తే బాగుండదు అనుకోని ఆయన ఆ పూల కుండీ దగ్గర డబ్బులు వేసి వెళ్ళిపోతాడు.దాంతో వాళ్ళు వల్ల ఇంటికి దేవుడు వచ్చాడు అని చెప్తూ ఉంటారు సేమ్ అదే సీన్ ని త్రివిక్రమ్ అతడు సినిమాలో పెట్టాడు…
ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.అయితే ఈ సినిమా తో మహేష్ బాబు కి ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక త్రివిక్రమ్ ఇప్పటి వరకు తనతో ఎక్కువ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ కి ఇద్దరికీ కూడా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. అందుకే ఇక మహెష్ ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా ఇండస్ట్రీ హిట్ ఈ సినిమాతో ఇవ్వబోతున్నాడు…