Actor Jaffer Sadiq: ఈ మధ్య విడుదలైన రజినీకాంత్ జైలర్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ రజినీకాంత్ దీటుగా నటించడం మరో విశేషం. శివ రాజ్ కుమార్ దగ్గర నుంచి యోగి బాబా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాలో మనకు కొన్ని సీన్స్ లోనే కనిపించిన గుర్తుంది పోయేలాగా నటించారు. అయితే ఇందులో ముఖ్యంగా శివరాజ్ కుమార్ రజనీకాంత్ కి పరిచయం చేసే మరగుజ్జు నటించిన మనిషిని చూస్తే.. ఈయని మనం ఎక్కడో చూసామే అన్న సందేహం మీకు వచ్చుండక మానదు.
మీ సందేహం కరెక్టే. పోయిన సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ అయిన విక్రమ్ సినిమాలో కూడా ఈయన ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ హీరోలు నటించారు. అయితే ఇంతమంది మహామహులు ఉన్నా కానీ సంతానం గ్యాంగ్లో ఉంది ఒక మరగుజ్జు మెంబర్ మాత్రం మన దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు ? అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రెండు సినిమాలలో మన దృష్టిని తన వైపు మళ్ళించుకున్న ఆయన పేరు జాఫర్ సాదిక్. జులై 04, 1995న జన్మించిన జాఫర్ సాదిక్ తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన వాడు. తన చిన్న చిన్న పాత్రల ద్వారా తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా పేరు తెచ్చుకున్నారు. ఈయన గురించి మరో విషయం ఏమిటి అంటే.. జాఫర్ కేవలం నటుడు కాదు.. కొరియోగ్రఫార్, డ్యాన్సర్ కూడా. జాఫర్ ఉంగలిల్ యార్ ప్రభుదేవా అనే తమిళ డ్యాన్స్ షో లో పాల్గొని ఆ షో లో రన్నర్ గా నిలిచారు. ఇక ఆ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఆ తరువాత సొంతంగా లిప్టదర్స్ అనే ఓక డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు.
వీటన్నిటికీ మించి ఈయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఎందుకంటే జాఫర్ కి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఎన్నో స్టేజ్ షోల్లో కూడా కనిపించిన జాఫర్, 2018లో ఆయన tedxgct ఈవెంట్ లో చేసిన పెర్పార్మన్స్ బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఆ తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఓ తమిళ సిరీస్ పావకధైగల్ నారికొట్టిగా నటించాడు. ఇక తర్వాత నుంచి ఆయనకి సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.
ఇక ప్రస్తుతం కమలహాసన్.. రజనీకాంత్ లాంటి వారి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జాఫర్.. మరెన్నో ఆఫర్లు తెచ్చుకుంటారో లేదో వేచి చూద్దాం.