12KM Movie: ఒక ఆడియన్ తనకున్న బాధల నుంచి రిలాక్స్ అవడానికి ఒక సినిమాను చూస్తాడు. ఇక ముందుగా ఆ సినిమా బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని మరి కొంతమంది ఆడియన్స్ ఆ సినిమాను చూస్తారు. ఎందుకంటే ఆ సినిమా మీద కేటాయించే మూడు గంటల సమయం వృధా అవ్వకుండా ఉండటానికే సినిమా ఎలా ఉందో తెలుసుకొని దాన్ని చూడడానికి ఇష్టపడతారు.
ఆ సినిమా చూసే సమయంలో వాళ్లకి ఉన్న స్ట్రెస్ ని మర్చిపోయే విధంగా ఆ సినిమా ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. ఇక మరికొంత మంది మాత్రం టైం పాస్ అవ్వడం కోసం అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. ఇక మనకు కావాల్సిన ప్రతి సినిమా ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అవలేబుల్లో ఉంటున్నాయి. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలైతే థియేటర్ లో అందుబాటులో ఉంటాయి. వాటిని అక్కడ చూడవచ్చు. ఇక ఇప్పటివరకు ప్రతి సినిమా విషయంలో ఆడియన్స్ అనుసరిస్తున్న విధానం అయితే ఇదే..
కానీ ఒక సినిమాను చూడాలంటే మాత్రం మనం తప్పకుండా ఆ దర్శకుడి యొక్క పర్మిషన్ తీసుకోవాలట.. ఇదెక్కడి విచిత్రం అని అనుకుంటున్నారా..? ఒకరకంగా మనకు ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ ఇది మాత్రం నిజం. అయితే ఆ సినిమా ఏంటి.? ఆ దర్శకుడు ఎవరు.? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
రష్యా కు చెందిన ‘మైక్ పెస్సి’ అనే డైరెక్టర్ ’12 కే ఎం’ అనే హార్రర్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాని చూడడానికి ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఆ దర్శకుడు యొక్క పర్మిషన్ తీసుకోవాలట. అది ఎలా అంటే దర్శకుడు యొక్క ఇన్ స్టా ఐడి లో మేము మీ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నాము అని అతనికి మెసేజ్ పెట్టాలట. ఇక అప్పుడు ఆయన మీకు నచ్చిన రెండు హార్రర్ థ్రిల్లర్ సినిమాల పేర్లని చెప్పమని రీప్లే పెడతాడట. ఇక దాని ద్వారా మనకు నచ్చిన హార్రర్ సినిమాలు ఏంటో ఆయన తెలుసుకొని ఆ సినిమాలు అతనికి నచ్చితే మనకు ఆయన సినిమా చూడడానికి లింక్ అయితే సెండ్ చేస్తాడట…
ఒకవేళ నచ్చకపోతే మాత్రం మనకు లింక్ ని సెండ్ చేయడు. ఇక దీని ద్వారా ఆయనకు వచ్చేది ఏంటంటే తన సినిమాని చూడడానికి ఎంత మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనే విషయాన్ని ప్రత్యక్షం గా తెలుసుకోవడం కోసమే ఆయన ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది…