https://oktelugu.com/

Bollywood: కత్రినా – విక్కీ కి అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చిన సల్మాన్ ఖాన్, రణ్ బీర్… ఏమిచ్చారంటే

Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో విక్కీ-కౌశల్ ల వివాహం జరిగింది. దీనికి బాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరయ్యారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయ్యే వరకు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట… ఆ తరువాత సోషల్ మీడియాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 08:37 AM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో విక్కీ-కౌశల్ ల వివాహం జరిగింది. దీనికి బాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరయ్యారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయ్యే వరకు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట… ఆ తరువాత సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. మెహందీ, హల్దీ, వెడ్డింగ్ ఇలా ప్రతి ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఈ జంట. ఇదిలా ఉండగా బాలీవుడ్ ప్రముఖుల నుంచి మాత్రం ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది.

    interesting details about bollywood celebraties gifts to viktrina couple

    Also Read: ఎట్టకేలకు నెరవేరనున్న పునీత్ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి నివసించిన పూరిల్లు

    ముఖ్యంగా వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కత్రినా పెళ్లి సందర్భంగా రణబీర్ కపూర్ రూ.2.7 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ బహుమతిగా ఇవ్వగా… సల్మాన్ ఖాన్ రూ.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక అలియా భట్ లక్ష రూపాయలు విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. అలానే అనుష్కశర్మ-విరాట్ కోహ్లీ రూ.6.4 లక్షల విలువైన డైమండ్ ఇయరింగ్స్ ను గిఫ్ట్ గా పంపించారట. షారుఖ్ ఖాన్ లక్షన్నర విలువ చేసే పెయింటింగ్ ను ఇవ్వగా… హృతిక్ రోషన్ మూడు లక్షల విలువ చేసే బీఎండబ్య్లూ కంపెనీకి చెందిన బైక్ ను విక్కీ కౌశల్ కి ఇచ్చారట. వీరితో పాటు తాప్సీ కూడా ఓ ప్లాటినం బ్రేస్ లెట్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. ప్రస్తుతం ఈ గిఫ్ట్ ల గురించి బాలీవుడ్ లో జోరుగా చర్చించుకుంటున్నారు. మరి ఈ ఫోటోలను కూడా ఈ జంట సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారో లేదో చూడాలి.

    Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్​ యూనివర్స్​.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్​