https://oktelugu.com/

Gharana Mogudu Movie: చిరు ఇమేజ్ ను పెంచిన ఘ‌రానా మొగుడు.. దీని వెన‌క జ‌రిగిన ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు ఇవే…

Gharana Mogudu Movie: చిరంజీవి సినీ కెరీర్‌ను అమాంతం మార్చేసిన మూవీ ఘ‌రానా మొగుడు. ఈ మూవీ త‌ర్వాత చిరు స్టామినా ఏంటో ఇండియ‌న్ బాక్సాఫీస్‌కు తెలిసిపోయింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ మూవీతో ఆయ‌న బిగ్గ‌ర్ దెన్ బిగ్ బీ అయిపోయాడు. అంత‌లా ఆయ‌న‌కు పేరు తీసుకు వ‌చ్చింది. మాస్ ఇమేజ్‌ను పెంచిన ఈ మూవీ 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది. నేటితో 30ఏండ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ వెన‌కాల […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 11, 2022 / 12:25 PM IST
    Follow us on

    Gharana Mogudu Movie: చిరంజీవి సినీ కెరీర్‌ను అమాంతం మార్చేసిన మూవీ ఘ‌రానా మొగుడు. ఈ మూవీ త‌ర్వాత చిరు స్టామినా ఏంటో ఇండియ‌న్ బాక్సాఫీస్‌కు తెలిసిపోయింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ మూవీతో ఆయ‌న బిగ్గ‌ర్ దెన్ బిగ్ బీ అయిపోయాడు. అంత‌లా ఆయ‌న‌కు పేరు తీసుకు వ‌చ్చింది. మాస్ ఇమేజ్‌ను పెంచిన ఈ మూవీ 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది. నేటితో 30ఏండ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ వెన‌కాల జ‌రిగిన ఓ ప‌ది ఆస‌క్తిక‌ర ప‌రిణామాల గురించి తెలుసుకుందాం.

    Gharana Mogudu Movie

    ఈ మూవీతో చిరంజీవి- రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మూవీ రిలీజ్ అయితే హిట్ గ్యారెంటీ అని మ‌రోసారి నిరూపించింది. వీరి కాంబినేష‌న్ లో దాదాపు 13మూవీలు వ‌స్తే.. అందులో ఘరానా మొగుడు సినిమానే బిగ్గెస్ట్ హిట్ అయింది.

    ఈ మూవీతో చిరు-రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో వ‌రుస‌గా మూడేండ్లు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. అంత‌కు ముందు 1990లో జగదేకవీరుడు-అతిలోక సుందరి మూవీ రాగా.. 1991లో రౌడీ అల్లుడు సినిమా, 1992లో ఘరానా మొగుడు మూవీలు వ‌చ్చి హిట్ కొట్టాయి.

    Gharana Mogudu Movie

    క‌న్న‌డ‌లో రాజ్ కుమార్ నటించిన అనురాగ అరళితు సినిమాకు రీమేక్ గా తెలుగులో ఘ‌రానా మొగుడు తీశారు.

    ఈ మూవీ అప్ప‌ట్లో 56 కేంద్రాలలో వంద రోజులు ఆడి చిరు ఇమేజ్ ఏంటో నిరూపించింది. ఇక మూడు సెంట‌ర్ల‌లో రజతోత్సవం నిర్వ‌హించుకుంది. ఆ కాలంలోనే ఏకంగా రూ.10 కోట్లు వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి సంచ‌ల‌న రికార్డు న‌మోదు చేసింది.

    ఈ మూవీలో వ‌చ్చే పండు పండు.. సాంగ్ షూటింగ్ లో భాగంగా చిరు హీరోయిన్ న‌గ్మ‌తో లిప్ లాక్ చేయాల్సి ఉంది. అయిష్టంగానే లిప్ లాక్ పెట్టిన మెగాస్టార్‌.. ఆ రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారంట‌. ఆ త‌ర్వాత మ‌ద్రాసుకు వెళ్లి ఆ సీన్‌ను ఎడిటింగ్ చేయించేశారు.

    ఇక ఇందులోని బంగారు కోడిపెట్ట పాట స్టేట్‌ను ఊపేసింది. కాగా ఈ సాంగ్‌ను మ‌గ‌ధీర సినిమాలో 2009లో రాంచరణ్ రీమిక్స్ చేశారు.

    ఈ మూవీకి పెద్ద ప్ల‌స్ పాయింట్ కీరవాణి సంగీతం. ఆయ‌న అందించిన పాట‌లు అప్ప‌ట్లో తెలుగు ప్ర‌జ‌ల‌ను ఊపేశాయి. దీంతో సూర్య మ్యూజిక్ ఆడియో కంపెనీ లాభాల పంట పండింది. విపరీతంగా క్యాసెట్లు అమ్ముడుపోయాయి.

    Also Read: ‘దుల్కర్‌ -మృణాళిని’ ప్రేమ కథను రష్మిక గెలిపిస్తుందా ?

    ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఇండియాలోనే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోగా చ‌రిత్ర సృష్టించారు. దీంతో మలయాళ భాష‌కు చెందిన మనోరమా ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరును ‘బిగ్గర్‌ దెన్ బచ్చన్ గా అభివ‌ర్ణించింది.

    1993లో జ‌రిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీని ప్రదర్శించారు.

    ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్స‌వానికి బాలకృష్ణ వ‌చ్చారు. మొదటి సీన్ కు క్లాప్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

    Also Read: కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

    Tags