https://oktelugu.com/

Pranitha Subhash: తల్లి కాబోతున్న ‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ !

Pranitha Subhash: హోమ్లీ హీరోయిన్ ప్రణీత సుభాష్ కి అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు. చాల కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రణీత. గత ఏడాది పెళ్లి కూడా చేసుకొంది ఈ హోమ్లీ బ్యూటీ. అయితే.. తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఏమిటి అంటే అది.. ఈ అందాల తార త్వరలోనే తల్లి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2022 / 12:35 PM IST
    Follow us on

    Pranitha Subhash: హోమ్లీ హీరోయిన్ ప్రణీత సుభాష్ కి అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు. చాల కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రణీత. గత ఏడాది పెళ్లి కూడా చేసుకొంది ఈ హోమ్లీ బ్యూటీ. అయితే.. తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    Pranitha Subhash and Pawan Kalyan

    ఇంతకీ ఏమిటి అంటే అది.. ఈ అందాల తార త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్న ప్రణీత.. మొత్తానికి తల్లిగా ప్రమోట్ అవ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేసింది.

    Pranitha Subhash

    త‌న ప్రగ్నెన్సీ విష‌యం గురించి ప్రణీత సుభాష్ ఇన్ డైరెక్ట్ గా తెలియజేస్తూ.. ‘నా భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక బహుమతి అందింది. ఈ బహుమతిని పైన ఉన్న దేవతలే మాకు ఇచ్చారు’ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ లోకి ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ ఆమె సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

    Also Read: చిరు ఇమేజ్ ను పెంచిన ఘ‌రానా మొగుడు.. దీని వెన‌క జ‌రిగిన ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు ఇవే…

    తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం కాకపోవడం కారణంగా ఆమెకు పెద్దగా పెద్ద సినిమాలు రాలేదు. పవన్ కళ్యాణ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆ సినిమా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత కూడా ప్రణీత చాలా చిత్రాల్లో నటించింది. కానీ.. ఏ చిత్రం ప్రణీత కెరీర్ ను టర్న్ చేయలేకపోయింది.

    ఎలాగూ సినీ కెరీర్ బాగాలేదు కాబట్టే.. ఆమె నితిన్ రాజును పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ప్రణీత పెళ్లి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత.. మరో కొత్త విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఈ మ్యాటర్ హాట్ టాపిక్ అయింది.

    Also Read: ‘దుల్కర్‌ -మృణాళిని’ ప్రేమ కథను రష్మిక గెలిపిస్తుందా ?

    Tags