Divorce Photo Shoot: పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు.. ఒక్కసారి మెడలో తాళి పడితే జీవితాంతం ఆ వ్యక్తితోనే కలిసుండాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఫాస్ట్ జనరేషన్ కారణంగా నేటి కాలంలో చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. దంపతుల మధ్య మనస్పర్థలు రాగానే నేరుగా కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకుంటున్నారు. విడాకుల తరువాత ఎక్కువగా నష్టపోయేది మహిళలే అనే భావన చాలా మంది ఉంది. దీంతో విడాకులు తీసుకున్న తరువాత తమ జీవితం ఎలా ఉంటుందోనని బాధపడుతూ ఉంటారు. కానీ ఓ భార్య తన భర్తతో విడిపోయిన తరువాత సెలబ్రేషన్ చేసుకుంది. అయితే ఆమె ఇలా చేయడానికి ఓ కారణం ఉందట. అదేంటో చూద్దాం.
రెడ్ సారీలో చేతిలో ఓ వర్డ్ ఉన్న ఉన్న ఈ యువతి ఎంతో ఉల్లాసంగా కనిపిస్తోంది. దీంతో మొదట్లో చూసిన వాళ్లకు ఈమె ఓ వెడ్డింగ్ షూట్ లో ఫొటో దిగిందని అనుకున్నారు. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ ‘DIVORCED’ అని రాసి ఉంది. అదేంటి ఆమె దీనిని ఎందుకు పట్టుకుందని ఆరా తీసేసరికి మరో ఫొటో ఉంది. అందులో ఓ ఫొటోను చించేస్తుంది. అది తన భర్తతో కలిసిన్న ఫొటో తన వరకు ఉంచుకొని భర్త ఉన్న ఫొటోను చింపేస్తేంది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఆమె ‘ నాకు 99 సమస్యలు ఉన్నాయి. కానీ నా భర్త ఒక్కటి కాదు’ అని రాసి ఉన్న బోర్డు ఉన్న ఫొటోలు దిగారు.
వీటిని పరిశీలిస్తే ఆమె ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు అర్థమయింది. అయితే చాలా మంది విడాకుల విషయం ఎత్తగానే భయపడిపోతుంటారు. కన్నీళ్లతో కుంగిపోతారు. కానీ ఈమెందుకు ఇంత సంతోషంగా ఉంది.. అని అనుకోకుండా ఆమె అసలు విషయాన్ని ఇతరులతో పంచుకుంది. తాను విడాకులు తీసుకొని ఇతరుల్లాగా కుంగిపోలేను అని తెలిపింది. లాగే ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇష్టం లేని భాగస్వామితో జీవితాంతం కలిసుండడం కంటే విడిపోవడం సరైనదే. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి అర్హులు. జీవితం మీదే. జీవితం ఎవరి సొత్తు కాదు. విడాకులు తీసుకోవడం వైఫల్యం కాదు, ఒంటరిగా ఉండే వారందరికీ ఇది అంకితం’ అంటూ మెసెజ్ పెట్టారు. ఈ పిక్స్ వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు రియాక్టయ్యారు. తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.