Inaya Sultana: ఇనాయ సుల్తానా అంటే తెలియని బిగ్ బాస్ ప్రేమికులు ఉండరు. గత సీజన్లో మోత మోగించింది అమ్మడు. ఇనాయ సుల్తానా హౌస్లో ఓపెన్ గానే ఎఫైర్స్ నడిపింది. కన్ఫెషన్ రూమ్ లో తనకు ఆర్జే సూర్య అంటే ఇష్టం అని మనసులో మాట బయటపెట్టింది. చెప్పిందే తడవుగా అతనితో సన్నిహితంగా మెలిగింది. ఒక దశలో గేమ్ కూడా పక్కన పెట్టి సూర్యతో ప్రేమలో మునిగిపోయింది. నాగార్జున ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో కొన్నాళ్ళు విడిపోతున్నట్లు నటిద్దాం అని ఒప్పందం చేసుకున్నారు.
అందుకే ఆ వారం సూర్య నామినేట్ చేసింది. అనూహ్యంగా అదే వారం సూర్య ఎలిమినేట్ అయ్యాడు. సూర్య ఎలిమినేటైన రోజున ఇనాయ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక సూర్య ఎలిమినేట్ అయ్యాక అతడి జ్ఞాపకాలతో హౌస్లో బ్రతికింది. తర్వాత గేమ్ పై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది. లేడీ టైగర్ గా ఆమె హౌస్లో పేరు తెచ్చుకుంది. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించేది. తనకు నచ్చినట్లు హౌస్లో ఉండేది.
ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన ఇనాయ సుల్తానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యింది. ఒక దశలో టైటిల్ విన్నర్ గా ప్రచారం దక్కించుకుంది. అయితే ఇనాయ ఫైనల్ కి ముందు వారం ఎలిమినేట్ అయ్యింది. ఇనాయ ఎలిమినేషన్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకంగా కామెంట్స్ వినిపించాయి.
ఫైనల్ కి వెల్లకున్నా ఇనాయ అభిమానులను సొంతం చేసుకుంది. ఇక నటిగా మారినందుకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు ఇనాయ హౌస్లో చెప్పింది. హౌస్ వేదికగా వాళ్ళ నాన్నకు క్షమాపణలు చెప్పింది. కుటుంబ పరువు తీసే పని చేయనని ప్రామిస్ చేసింది. ఇనాయకు ఫేమ్ వచ్చిన నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి.
ఇనాయను వెలుగులోకి తెచ్చిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఓ పార్టీలో వర్మతో పాటు ఆమె ఎంజాయ్చేశారు . ఇద్దరూ కలిసి మందు తాగుతున్న ఫోటోలు బయట వైరల్ అయ్యాయి. వర్మతో ఉన్న ఈ అమ్మాయి ఎవరనే చర్చ మొదలైంది. ఆ విధంగా ఇనాయ పేరు అందరికీ తెలిసింది. ఈ కారణంతో ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఇనాయ కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.