Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Help On Nithin: నితిన్‌కు తొలినాళ్లలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక సాయం చేశాడ‌ట‌.....

Pawan Kalyan Help On Nithin: నితిన్‌కు తొలినాళ్లలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక సాయం చేశాడ‌ట‌.. అందుకే ఇంత‌లా ఆరాధిస్తున్నాడా..!

Pawan Kalyan Help On Nithin:  టాలీవుడ్ లో నితిన్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు మంచి స్నేహ బంధం ఉంది. నితిన్ అయితే ప్ర‌తి సినిమాలో ప‌వ‌న్ పేరును ఎత్త‌కుండా ఉండ‌లేరు. పైగా ప‌వ‌న్ కు తాను పెద్ద అభిమానిని అంటూ కూడా చెప్పుకుంటారు నితిన్‌. ప‌వ‌న్ ది ఏ సినిమా రిలీజ్ అయినా స‌రే.. థియేట‌ర్‌కు వెళ్లి మ‌రీ సినిమా చూసి త‌న ఫీలింగ్ ను పంచుకుంటారు హీరో నితిన్‌.

Pawan Kalyan Help On Nithin
Pawan Kalyan Help On Nithin

అయితే కెరీర్ తొలినాళ్ల‌లో నితిన్‌కు ప‌వ‌న్ సాయం చేశాడంట‌. అది కూడా ఆర్థిక‌ప‌రంగా. నితిన్ తండ్రి మొద‌టి నుంచి టాలీవుడ్ లో పెద్ద డిస్ట్రిబ్యూట‌ర్ గా ఉన్నాడు. అప్ప‌టికే మంచి సినిమాలు తీస్తూ ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్ట‌ర్ తేజ‌తో ఆయ‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ సారి తేజ ఒక ప‌ని విష‌యంలో నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో నితిన్ హీరోగా ప‌రిచ‌యం కావాల‌ని చూస్తున్నాడు.

Also Read: ప్రభాస్ ఒక్కఫైట్​ కూడా లేకుండా చేసిన సినిమా ఇదే

ఇదే విష‌యాన్ని సుధాక‌ర్ రెడ్డి డైరెక్ట‌ర్ తేజ‌కు చెప్పారంట‌. నితిన్ అదృష్ట‌మో ఏమో తెలియ‌దు గానీ.. జ‌యం మూవీ కోసం కొత్త యంగ్ హీరో కోసం తేజ వెతుకుతున్నాడంట‌. అదే స‌మ‌యంలో నితిన్ గురించి సుధాక‌ర్ చెప్ప‌డంతో ఓ సారి ఆడిష‌న్స్‌కు రావాల‌ని నితిన్‌కు సూచించాడంట తేజ‌. నితిన్ ఆడిష‌న్స్ లో బాగా చేయ‌డంతో తేజ కూడా ఓకే అని చెప్పి జ‌యం మూవీని మొద‌లు పెట్టారు.

Pawan Kalyan Help On Nithin
Pawan Kalyan Help On Nithin

అయితే మూవీ షూటింగ్ 60శాతం పూర్త‌యిన త‌ర్వాత ఆర్థిక ప‌రంగా కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తాయంట‌. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే విధంగా ఆర్థిక సాయం అందించాడంట‌. ఇక 2002లో విడుద‌లైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. మొద‌టి సినిమాతోనే నితిన్ రికార్డులు సృష్టించాడు. రూ.2కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ మూవీ రూ.30 కోట్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టింది. దీంతో హీరోగా నితిన్ పేరు మార్మోగిపోయింది. సినిమా పెద్ద హిట్ కావ‌డంతో ప‌వ‌న్ ఇచ్చిన సాయాన్ని తిరిగి ఇచ్చేశారంట‌. కాగా ప‌వ‌న్ వ‌ల్లే త‌న మూవీ పూర్తియింద‌ని, హీరోగా పేరు వ‌చ్చింద‌నే కార‌ణంగా.. అప్ప‌టి నుంచే ప‌వ‌న్‌కు నితిన్ భ‌క్తుడు అయిపోయాడు.

Also Read: బొమ్మ‌రిల్లు మూవీని వ‌దులుకున్న హీరో ఇత‌నే.. చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version