Shekhar Master : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే ఆ హీరోలు స్టార్ హీరోలుగా ఎదగడంలో ఇతర టెక్నీషియన్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. నిజానికి కొరియోగ్రాఫర్స్ హీరోల ఎదుగుదలలో చాలావరకు యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హీరోల మ్యాగజైన్స్ కి తగ్గట్టుగా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి సినిమా విజయంలో దానిని భాగం చేస్తూ ఉంటారు..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో పాటు టెక్నీషియన్స్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు వాళ్ల క్రాఫ్ట్ లో బెస్ట్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల వాళ్ళని స్టార్ హీరోలు కూడా వాళ్ల సినిమాల్లో పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి కూడా క్రియేట్ చేసుకునేలా మంచి పేరు ప్రఖ్యాతలైతే సంపాదించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి శేఖర్ మాస్టర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సాంగ్స్ విషయంలో చాలా వరకు నెగెటివిటి అయితే ఏర్పడుతుంది. ఇక పుష్ప సినిమాలో ఆయన పీలింగ్స్ అనే సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ సాంగ్ లో అసలు అల్లు అర్జున్ తో డిఫరెంట్ స్టెప్పులైతే వేయించలేదు. ఇంతకుముందు ఆయన వేసిన సినిమాల్లోని స్టెప్పుల్ని తిప్పితిప్పి వేశాడు. అలాగే మ్యూజిక్ వచ్చినప్పుడు అల్లు అర్జున్, రెష్మిక మందాన కలిసి వేసే స్టెప్పులు పెళ్లి భరత్ లో బాగా తాగి వేసే వాళ్లు ఎలాంటి స్టెప్పులు అయితే వేస్తారో అలాంటి స్టెప్పులు వాళ్లతో వేయించాడు అంటూ కొంతవరకు నెగెటివ్ కామెంట్లనైతే మూట గట్టుకున్నాడు…
ఇక ఇప్పుడు బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడే’ అనే సాంగ్ లో బాలయ్యతో కొన్ని వల్గర్ స్టెప్పులను వేయించాడు అంటూ అలా కూడా కొన్ని విమర్శలైతే ఎదుర్కొంటున్నాడు. మరి శేఖర్ మాస్టర్ ఇంతకుముందు టాప్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్న క్రమంలో ఇలాంటి నెగెటివిటిని తెచ్చుకుంటున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన కొరియోగ్రఫీ చేయొచ్చు కదా అంటూ మరి కొంతమంది వాళ్ళ కామెంట్లనైతే తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా శేఖర్ మాస్టర్ ఈ మధ్యకాలంలో డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంతకుముందు ఆయనతో ఉన్న స్పార్క్ అయితే ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. ఏదో మమ అనేలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి పెడుతున్నాడు అంతే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇంతకుముందులా ఆయన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి అంటే మాత్రం మరికొన్ని సాంగ్స్ తో మంచి కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తే తప్ప ఆయన మీద ఉన్న నెగెటివిటి అయితే తగ్గే అవకాశం లేదు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…