Pawan Kalyan : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి… ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా నుంచి ‘బ్రో ‘ సినిమా వరకు ప్రతి సినిమాలో ఆయన ఐడెంటిటి అయితే చూపిస్తూ వచ్చాడు. తద్వారా ఆయనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అనే గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా కళ్యాణ్ మొదటి చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా ఆ తర్వాత ఆయనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను ఏర్పాటు చేసుకొని యూత్ అందరినీ తన అభిమానులుగా తిప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే చిరంజీవి లేనిదే ఆయన లేడు అంటూ ఇప్పటికి చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి చిరంజీవి సినిమాని మొదటిరోజు చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడట. దానికోసం అభిమానుల మధ్యలో చిరంజీవి సినిమాలు చూసి అభిమానులు ఎలా రియక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి ఆయన చాలావరకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడట.
మరి దీని కోసమే చిరంజీవి చేసిన కొన్ని సినిమాలను పవన్ కళ్యాణ్ ఎవ్వరికీ తెలియకుండా మాస్క్ వేసుకొని వెళ్లి సినిమా థియేటర్ లో ఒక సామాన్య ప్రేక్షకుడిలా కూర్చొని సినిమాను చూసి ఎంజాయ్ చేశానని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమాని కాబట్టి తను కూడా అరుపులు, ఈలల, గోలలు మధ్య సినిమా చూస్తేనే అతనికి ఆ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ చెప్పాడు.
ఇక ఇదిలా ఉంటే ఇంతకీ పవన్ కళ్యాణ్ మాస్క్ వేసుకొని థియేటర్ కి వెళ్లి చూసిన చిరంజీవి సినిమాలు ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది… ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర ‘ , ‘ఠాగూర్ ‘ లాంటి సినిమాలను పవన్ కళ్యాణ్ అలా మాస్క్ వేసుకొని వెళ్లి జనాల మధ్యలో కూర్చొని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారట. ఇక ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించడంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయినట్టుగా ఒకానొక సందర్భంలో తెలియజేశాడు. మరి మొత్తానికైతే చిరంజీవి లాంటి అన్నయ్య ఉండటం తన అదృష్టం అంటూ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో తెలియజేశాడు…