https://oktelugu.com/

RRR Movie: ‘ఆర్​ఆర్​ఆర్​’లో ఎన్టీఆర్​ పాట.. అందులో నిజమెంత?

RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రమోషన్స్​లో భాగంగా రాజమౌళి భారీ ప్లాన్​ చేస్తున్నారు. అయితే, తాజాగా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 12:09 PM IST
    Follow us on

    RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రమోషన్స్​లో భాగంగా రాజమౌళి భారీ ప్లాన్​ చేస్తున్నారు. అయితే, తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట పాడారంటూ ఇండస్ట్రీలో టాక్​ వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తం లేదని పలువురు భావిస్తున్నారు. మరి నిజమేంటో తెలియాల్సి ఉంది.

    ఈ క్రమంలోనే వరుస అప్​డేట్స్​, రూమర్స్​తో ఆర్​ఆర్​ఆర్​ దేశవ్యాప్తంగా ఫుల్​ ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్​ కొమరం భీమ్​గా కనిపంచనుండగా. అల్లూరి పాత్రలో చరణ్ నటించనున్నారు. జనవరి 7న  రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

    మరోవైపు బాలీవుడ్​లోనూ ఈ సినిమా ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు రాజమౌలి ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్​ఖాన్​ను కలిసినట్లు ఇటీవలే వార్తలు వనిపించాయి. మరి ఇంతటి అంచనాలు, భారీ పోటీల నడుమ సంక్రాంతి బరిలో దిగుతున్న ఆర్​ఆర్​ఆర్​ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.