Homeఎంటర్టైన్మెంట్RRR: ఉత్కంఠ రేపుతోన్న ఆర్​ఆర్​ఆర్ సెకెండ్​ సింగిల్​ బజ్​!​

RRR: ఉత్కంఠ రేపుతోన్న ఆర్​ఆర్​ఆర్ సెకెండ్​ సింగిల్​ బజ్​!​

RRR: తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్​- ఎన్టీఆర్​ కలిసి నటిస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. బాహుబలి వంటి భారీ సక్సెస్​ తర్వాత భారీ బడ్బెట్​తో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తీస్తున్న అద్భుత సృష్టి ఆర్​ఆర్​ఆర్​. ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్​ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. గతంలో రామ్​ఫర్​ భీమ్​, భీమ్​ ఫర్​ రామ్​ పేరుతో విడుదలైన టీజర్​లు చెర్రి, తారక్ అభిమానులకు నూతనోత్సాహాన్ని నింపాయి. కాగా, తాజాగా, ఇలా ఎప్పటికప్పుడు వరుస అప్​డేట్స్​తో ప్రేక్షకుల్లో సినిమాపై తారస్థాయికి చేరుస్తోంది చిత్రబృందం. ఇలా ఉండగా, తాజాగా, దీపావళి సందర్భంగా సెకెండ్​ సింగిల్​పై మరో అప్​డేట్​ ఇచ్చారు.

RRR Glimpse ft. NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | S.S. Rajamouli | Releasing on 7th Jan 2022

గతంలో ఇద్దరు హీరోలపై ఉన్న స్నేహాన్ని ప్రతిబింబించే పాటను విడుదల చేయగా.. ఈ సారి ఓ మాస్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్​. అయితే, ఈ పాట ఇద్దరి హీరోలకు సంబంధించిందా.. లేక ఒక్కరిపైనే చిత్రీకరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ భారీ సినిమా నుంచి ఓ మాస్​ సాంగ్​ త్వరలోనే వినబోతున్నట్లు తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

కాగా, మరోవైపు రామ్​చరణ్​ దర్శకుడు శంకర్​తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే తొలి షెడ్యూల్​ ప్రారంభించిన చిత్రబృందం.. యాక్షన్​ సీక్వెల్​ షూట్​ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్​కోసం కేజీఎఫ్​ ఫైట్​ మాస్టర్​ను బరిలోకి దింపినట్లు సమాచారం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version