Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వేదభూమి కేదార్ నాథ్ లో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతనతో మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ప్రతి మనిషి భక్తిభావంతో మెలగాలని సూచించారు. అనంతరం ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో సంభవించిన వరదలతో కేదార్ నాథ్ ఆలయం ధ్వంసం కావడంతో అక్కడ ఉన్న విగ్రహాలు పాడైపోవడంతో ఇప్పుడు వాటిని పునరుద్ధరించారు.

ప్రధాని శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సరస్వతి ఘాట్, శంకరాచార్యుల సమాధి, విగ్రహాలతో పాటు రూ.130 కోట్లతో నిర్మించిన ఇన్ ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. భద్రతా బలగాలను మోహరించారు.
2013 సంవత్సరంలో కేదార్ నాథ్ లో సంభవించిన వరదలతో ఆలయం మొత్తం అతలాకుతలం అయింది. భారీ స్థాయిలో ఆస్థి, ప్రాణనష్టం సంభవించింది. కానీ అప్పట్లో వచ్చిన వరద ముప్పుతో ఆలయానికి మాత్రం ఏ మాత్రం నష్టం కలగకపోవడం గమనార్హం. దీంతో అప్పట్లో ఈ విషయం వైరల్ అయింది. దైవ భక్తితోనే ఆలయం ఇంత పవిత్రంగా ఉందని అప్పట్లో పలు వార్తలు సైతం వచ్చాయి.
Also Read: Petrol and diesel rates: పెట్రో రేట్లు: మోడీ తగ్గించాడు.. ఆ రాష్ట్రాలు మాత్రం నో..
ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ఆలయంలో భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. దేవుని సేవలో తరించారు. దేశ ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థించారు. దీంతో కేదార్ నాథ్ కు భక్తులు పోటెత్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: COVID-19 antiviral pill: బ్రిటన్ సంచలనం: కరోనాను అంతం చేసే టాబ్లెట్ కనుగొంది