https://oktelugu.com/

BigBoss: రామ్​చరణ్​ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్​బాస్​ కంటెస్టెంట్స్​!

BigBoss: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు ఆచార్య సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, శంకర్​ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇలా వరుసగా పాన్​ఇండియా చిత్రాల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు చెర్రి. ప్రస్తుతం శంకర్​తో చేస్తున్న సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బిగ్​బాస్ కంటెస్టెంట్లకు అవకాశం లభించినట్లు తెలుస్తోంది. లోబో, విశ్వలకు ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 01:37 PM IST
    Follow us on

    BigBoss: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు ఆచార్య సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, శంకర్​ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇలా వరుసగా పాన్​ఇండియా చిత్రాల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు చెర్రి. ప్రస్తుతం శంకర్​తో చేస్తున్న సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బిగ్​బాస్ కంటెస్టెంట్లకు అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

    లోబో, విశ్వలకు ఈ ఆఫర్​ వచ్చినట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరు రామ్​చరణ్​తో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. మరోవైపు, రామ్​చరణ్ బిగ్​బాస్​ షోకు అదిథిగా రావడం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఈ సినిమా సెకండ్​ షెడ్యూల్​  రాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. చెర్రీ, కియారాపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. చరణ్​కు ఇది 15వ సినిమా.. దీంతో ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. మలయాళ నటుడు జయరామ్,సురేశ్ గోపీ సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కాగా, రామ్​చరణ్​ ఆచార్య సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్, చెర్రీ కి జోడీగా పూజ హెగ్డే నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్​లు నెట్టింట సందడి చేస్తున్నాయి.