Homeఎంటర్టైన్మెంట్Thaman Bday: థమన్​కు సూపర్​స్టార్​ మహేశ్​ స్పెషల్​ బర్త్​డే విషెష్​!

Thaman Bday: థమన్​కు సూపర్​స్టార్​ మహేశ్​ స్పెషల్​ బర్త్​డే విషెష్​!

Thaman Bday: ప్రస్తుతం టాలీవుడ్​ మ్యూజిక్​ డైరెక్టర్లలో ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు థమన్​. వరుసగా స్టార్​ హీరోలు, పాన్​ ఇండియా చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసి తనదైన బీట్స్​తో కుర్రకారును ఉరకలెత్తిస్తున్నాడు. ప్రతి హీరోకి డిఫరెంట్​ వేరియేషన్స్​లో అదిరే ఆల్బమ్స్ ఇస్తూ వెళ్లిపోతున్నాడు. కాగా, ఈ రోజు థమన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పులువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు థమన్​కు విషెష్ తెలిపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్​ స్టార్ మహేశ్​బాబు కూడా స్పెషల్​ విషెష్ తెలియజేశారు.

వీరిద్దరి కాంబినేషన్​లో సూపర్​ హిట్​ ఆల్బమ్స్​ చాలానే వచ్చాయి. ఇప్పటి వరకు మహేశ్​ సినిమాకు థమన్​ అందించిన పాటలన్నీ ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. సూపర్​ టాలెంటెండ్ థమన్​కు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని.. తన మ్యూజిక్​ మిలియన్లకి చేరుకోవాలని కోరుకుంటూ విషెష్​ తెలిపారు మహేశ్​.

వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటలో థమన్​ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా పరశురామ్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా కనిపించనుంది. తొలిసారి మహేశ్​కో కలిసి ఈ మహానటి స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది.

బ్యాంకింగ్​ సెక్టార్​లో జరిగే కుంభకోణం నేపథ్యంలో తండ్రిని కాపాడుకునే కొడుగ్గా మహేశ్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు ఇటీవల మహేశ్​ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్​ సినిమాపై ఎక్స్​పెక్​టేషన్స్​ను వేరే లెవెల్​లో పెట్టింది. ఈ సినిమాలో మహేశ్​ కొత్త లుక్​తో స్టైలిష్​గా కనిపించనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version