https://oktelugu.com/

‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ?

టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు ‘రామాయణం’ను భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని, నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందనే వార్త గత ఏడాది విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియాలో లేటెస్ట్ గా ఓ వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, రాముడిగా హృతిక్ రోషన్ నటించనున్నారని.. రావణుడిగా మలయాళ […]

Written By:
  • admin
  • , Updated On : October 14, 2020 / 11:03 AM IST
    Follow us on


    టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు ‘రామాయణం’ను భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని, నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందనే వార్త గత ఏడాది విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియాలో లేటెస్ట్ గా ఓ వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, రాముడిగా హృతిక్ రోషన్ నటించనున్నారని.. రావణుడిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే వీళ్ళు ఓన్లీ హిందీ వెర్షన్ లో మాత్రమే కనిపిస్తారట. తెలుగు వెర్షన్ లో ఇక్కడి హీరోలను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

    Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్

    అయితే తెలుగు వెర్షన్ వచ్చే సరికి రామాయణంలో ఎంతో కీలకమైన పాత్రలు అయిన రాముడి, రావణుడి పాత్రల్లో ఎవర్ని తీసుకోబోతున్నారో ఇంకా క్లారిటీ రాలేదట. రాముడి పాత్రను చేయాలంటే అది సామాన్యమైన విషయమా..సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహానటుడు పోషించిన పాత్ర అది, ఇప్పటి తరానికి కూడా రాముడు అనగానే ఆయన ఆకారమే మెదులుతోంది. అందుకే రాముడు పాత్ర విషయంలోనే ఏ స్టార్ ను తీసుకోవాలో మేకర్స్ కు ఇంకా క్లారిటీ లేదట. కానీ మహేష్ బాబు అయితే బాగుంటుందనేది ఒక ఆలోచన. మరి సౌత్ లో ఆ పాత్రను మహేష్ పోషిస్తే బాగుంటుందని మేకర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారట. రాముడి పాత్ర మహేష్ చేస్తే.. మరి రావణుడు పాత్ర సంగతి ఏమిటి.

    Also Read: ఆ హీరోయిన్లకు ‘బ్రేకప్’..ఇలా కలిసొచ్చిందా?

    నిజానికి రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ చేత ఆ పాత్ర చేయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్.. ఒక విలన్ పాత్ర చేస్తే.. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఒకటి ఉంది. ఏది ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆర్ కే అది సాధ్యం అవుతుందని.. తారక్ యమదొంగతోనే రుజువు చేశాడు. ఎలాగూ పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న హీరోలు కూడా మన తెలుగులో పెద్దగా లేరు కాబట్టి.. ఇలాంటి సినిమాలకు ఎన్టీఆర్ ఒక్కరే మెయిన్ ఆప్షన్.. మరి తారక్ రావణుడి పాత్రలో నటిస్తాడా.. ఒకవేళ తారక్ చేయకపోతే.. మోహన్ బాబు చేత ఆ పాత్రను చేయించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.