Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రాధే శ్యామ్. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఈ సినిమా ప్రభాస్‌కు ఎంత ప్రత్యేకమే స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. చాలా కాలంతర్వాత మళ్లీ డార్లింగ్‌ను లవర్‌బాయ్‌గా చూడబోతున్నందుకు ఆయన అభిమానలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు, ఈ సినిమా ఆల్బమ్పైనా అంతే అంచనాలు నెలకొన్నాయి.

కాగా, ఈ సినిమా ఆల్బమ్స్‌ను సౌత్ వర్షన్‌కు ఒకరు, హిందీ వర్షన్‌కు మరొకరు పని చేస్తున్నారు. హిందీలో మనన్ భరద్వాజ్ సాంగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనేే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో ఒకే పాటకోసం తాను ఏకంగా 30కి పైగా డిఫ్రెంట్ వర్షన్స్ను ప్రిపేర్ చేసుకున్నాడట. అయితే, వాటిల్లో ఒక్కటి మాత్రమే ఖరారు అవ్వడం.. ఫైనల్ అవుపుట్ మాత్రం వేరే లెవెల్ వచ్చిందని తెలిపారు. అయితే, థియేటర్లలో ఈ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తోంది చిత్రబృందం. మరోవైపు, సలార్ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రభాస్. ఇటీవలే ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు.