Koratala: ఎన్టీఆర్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్- కొరటాల కలయికలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమాపై ఓ రూమర్ వినిపిస్తోంది.

ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈసినిమా హీరోయిన్గా కియారా అద్వాని పేరు వినిపించింది. ఇప్పుడు జాన్వీ పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇటీవలే ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న కొరటాల.. సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఎన్టీఆర్‌తో కొరటాల హిట్ కొడతాడని అందరూ భావిస్తున్నారు.