Currency on Road: ప్రపంచంలో ఎక్కడైనా జేబులోనుంచి డబ్బు తీయనిదే ఏ పని కాదు. రైలు బండిని పచ్చ జెండా నడిపిస్తుంటే మనిషిని మాత్రం పచ్చనోటు నడిపిస్తుందని పాటలు కూడా వచ్చాయి. ఈరోజుల్లో ప్రతీ పని నగదుతోనే ముడిపడి ఉంది. ఎందుకంటే మనిషి జీవితాన్ని నడిపించేంది డబ్బే కనుక. అలాంటి డబ్బు రోడ్డుపై కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా..? టక్కున తీసుకొని జేబులో పెట్టుకుంటారు. ఇక కట్ట కట్టల డబ్బు కనిపిస్తే ఎవరూ ఆగలేరు. ఇదే సంఘటన అమెరికాలో జరిగింది. ఓ ట్రక్కు నుంచి కట్టల కట్టల డబ్బు రోడ్డుపై పడింది. ఇంకేముంది దానిని గ్రహించి కొందరు రోడ్డుపై ఏరుకోవడం మొదలు పెట్టారు. ఒకరిని చూసి ఒకరు అలా అటువైపు వచ్చిన వారంతా రోడ్డుపై దొరికిన డబ్బును తీసుకున్నారు. అయితే వారి ఆశలు ఆడియాశలే అయ్యాయి. ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు వంద రూపాయల నోటు కనిపిస్తే ఎవరూ చూడనప్పుడు దానిని వెంటనే తీసుకుంటాం. లేదంటే ఆ వంద రూపాయలు నాదేనంటూ గొడవ పడే అవకాశం ఉంది. అలాగే ఓ ట్రక్కు నుంచి డబ్బు పడిపోయినప్పుడు కూడా అక్కడ కొంత మంది తమ చేతికి వచ్చినంత నగదును తీసుకున్నారు. ట్రక్కు వెళ్లి పోయింది గదా.. ఎవరూ చూడలేదు కదా.. అని అనుకున్నారు..కానీ వారు తీసుకున్న ప్రతీ నోటు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. అందుకు పెద్ద కారణమే ఉంది.
శాండియోగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్యాలయానికి ఓ ట్రక్కు నోట్ల కట్టలతో బయలుదేరింది. ఈ ట్రక్కు దక్షిణ కాలిఫోర్నియా మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో శుక్రవారం ఉదయం 9.15 గంటలతకు దక్షిణ కాలిఫోర్నియాలకు రాగానే ట్రక్కు డోర్ అనుకోకుండా తెరుచుకుంది. దీంతో అందులో ఉన్న డబ్బుతో పాటు నగదు కట్టలున్న సంచులు అందులో నుంచి బయటపడ్డాయి. కొన్ని సంచులు చిరిగి అందులో నుంచీ డబ్బులు రోడ్డుపై చెల్లచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడున్న ప్రజలు, వాహనదారులు ముందుగా షాక్ కు గురయ్యారు.
ఆ తరువాత వెంటనే వాహనదారులు తమ వాహనాలను ఆపి డబ్బును తీసుకున్నారు. తమ చేతికి అందినంత నగదు తీసుకొని జేబులో పెట్టుకున్నారు. కొందరు తాము తెచ్చుకున్న బ్యాగులు నింపేసుకున్నారు. అయితే వారు డబ్బు తీసుకున్న ఆనందం ఎంతసేపు నిలవలేదు. వారు డబ్బు తీసుకుంటున్న వీడియో ప్రభత్వ అధికారుల వద్దకు చేరింది. దీంతో ఎవరెవరు ఎంత డబ్బు తీసుకున్నారో తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి నగదు తీసుకెళ్లిన వారు తిరిగి డబ్బులు చెల్లించకపోతే కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో కేసులకు భయపడి 12 మంది తాము తీసుకున్న నగదును తిరిగి ఇచ్చేశారు.
అయితే డబ్బు ఎంత పోయిందో అధికారులు వెల్లడించలేదు. కానీ 3 లక్షల డాలర్లు పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే కొందరు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించనట్లు తెలుస్తోంది.కానీ ఎప్పటికైనా వారిని పట్టుకొని అరెస్టుచేస్తామని అధికారులు అంటున్నారు. చివరికి ప్రభుత్వం ఏం చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలా డబ్బు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.