Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం సృష్టించింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. నదుల ప్రవాహం పెరిగి తీర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రభుత్వం మాత్రం సాయం అందించేందుకు ముందుకు రాలేదు. అధికార యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజల కష్టాలు వర్ణనాతీతం. కట్టుబట్టలతో బయటకు వచ్చి అన్నమో రామచంద్రా అంటూ లబోదిబోమంటున్నారు.

వరద ప్రభావంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. నష్టం భారీ స్థాయిలో చోటుచేసుకుంది. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో సాయం మాత్రం దండిగా అందడం లేదు. ఫలితంగా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. పెన్నా నీటి ప్రవాహంతో నెల్లూరు జిల్లాలో ప్రజలు పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి.
రహదారులు కోతకు గురయ్యాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఇలాంటి వరద చూడలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షబీభత్సానికి కుదేలైపోయారు. జరిగిన నష్టంపై కలత చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.
Also Read: KCR: ప్రధానిని కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్ వ్యూహం?
వరద తాకిడికి విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. చీకట్లోనే మగ్గుతూ నానా తంటాలు పడుతున్నారు. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పాపాఘ్ని నదిపై వంతెన కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: Jagan: జగన్ స్ట్రాటజీ: అనుకున్నది ఒక్కటి.. అవుతోందొక్కటి..