Politics Lookback: కాలగమనంలో మరో ఏడాది అంతర్ధానం కాబోతోంది. మరో వారం రోజుల్లో 2024 వీడ్కోల పలికి 2025కు స్వాగతం పలకబోతున్నాం. ఈ ఏడాదిలో చాలా వవరకు మంచి జరిగాయి. కొన్ని విషాద ఘటనలు, కొందరికి నిరాశపరిచే ఘటనలు కూడా జరిగాయి. ఇక ఈ ఏడాది ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. ఈ ఏడాది చాలా దేశాల్లో ఎన్నికలు జరిగాయి. కొంత మంది మాత్రమే మళ్లీ అధికారం చేపట్టారు. చాలా దేశాల ప్రజలు మార్పు కోరుకున్నారు. నూతన పాలకులను ఎన్నుకున్నారు. భారత్‌లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. ఇదే ఏడాది బంగ్లాదేశ్, శ్రీలంకలో సంక్షోభం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రభుత్వం మారింది. ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చే దక్షిణ కొరియాలోనూ ఊహించని విధంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.
అగ్రరాజ్యాధినేతగా ట్రంప్..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజంయ సాధించారు. 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించాడు. ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కేవలం 226కే పరిమతమయ్యారు.
మోదీ హ్యాట్రిక్..
ఇక భారత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమి మళ్లీ అధికారం చేపట్టింది. వరుసగా మూడోసారి ప్రధాని అయిన మోదీ.. జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ సీట్లు స్వల్పంగా పెరిగాయి.
దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ..
ఇక ప్రజాస్వా్యమ దేశమైన దక్షిణ కొరియాలో అనూహ్యంగా ఈ ఏడాది దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటలకే మళ్లీ తొలగించారు. ఇది జరిగిన వెంటనే అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయనను గద్దె దదించారు
విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్స్‌లర్..
జర్మనీ పార్లమెంటులో ఆ దేశ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షోలాజ్ విశ్వాన పరీక్షలో ఓడిపోయారు. మొత్తం 733 సీట్లున్న పార్లమెంటులో షోలాజ్‌కు మద్దతుగా కేవలం 2027 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 394 ఓట్లు వచ్చాయి. 116 మంది ఓటు వేయలేదు.
యూకేలో అధికారంలోకి లేబర్ పార్టీ
ఇక యునైటెడ్ కింగ్‌డమ్(బ్రిటన్) ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించిది. ప్రవాస భారతీయుడు రిషి సునాక్ నేతృత్వంలో పోటీ చేసిన కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. లేబర్ పార్టీ నేత కీవ్ స్టార్మర్ ప్రధాని అయ్యారు. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు..
15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను ముందుండి నడిపించిన షేక్ హసీనాకు ఈ ఏడాది గట్టి షాక్ తగిలింది. స్వాతంత్య్ర సమరవీరుల వారులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంపై మొదలైన నిరసనలు పోరాటానికి తీరితీశాయి. చివరకు షేక్ హసీనా దేశం విడచి పారిపోయారు. దీంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మళ్లీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి.
భారత్–చైనా బోర్డర్ సంధి
2020 గల్వాన్ గొడవ తర్వాత భారత్–చైనా సరిహద్దు సమస్య పెద్దదవుతూ వచ్చింది. అయితే ఈ సమస్యకు కూడా 2024లోనే పరిష్కారం దొరికింది. రెండు దేశాల లీడర్ల సమావేశం తర్వాత డిసెబర్‌లో చైనా–భారత్ ఆరుపాయింట్లు కోల్పయాయి.
బ్రిక్స్‌లో చేరిన కొత్త దేశాలు..
ప్రపంచంలో అమెరికా పెత్తనానికి సవాల్ విసురుతున్న బ్రిక్స్ దేశాల కూటమిలో కొత్తగా మరో ఐదు దేశాలు చేరాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్తగా బ్రిక్స్‌లో చేరాయి.
మళ్లీ పుతిన్ ప్రెసిడెన్సీ..
ఇక ఈ ఏడాది రష్యా ఎన్నికల్లో గెలిచిన వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశంపై తమ సైన్యం ఇంకా బలంగానే ఉందని నిరూపించాడు. ఈ ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేయడం ద్వారా పుతిన్ అత్యధిక సేవలందించిన నేతగా జోసెఫ్ స్టానిన్‌ను అధిగమిస్తాడు.
ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఏడాది జూన్ నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారు. పుతిన్ కోసం నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ రెడ్ కార్పెట్ పరిచారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం కీలకంగా మారింది. ఈ పర్యటన తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాకు సైనిక సాయం ప్రారంభించాడు.