కొత్త లుక్కులో ఆకట్టుకుంటున్న ‘కొమురంభీం’ ఎన్టీఆర్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా అలరించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. Also Read: ఆత్మాహుతి చేసుకుంటానని భయపడ్డారు: సత్యదేవ్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా రాజమౌళి విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపిన సంగతి తెల్సిందే. ఈనెల 22న […]

Written By: NARESH, Updated On : October 16, 2020 12:49 pm
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా అలరించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

Also Read: ఆత్మాహుతి చేసుకుంటానని భయపడ్డారు: సత్యదేవ్

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా రాజమౌళి విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపిన సంగతి తెల్సిందే. ఈనెల 22న ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ విడుదల చేస్తామని ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ టీజన్ కోసం నందమూరి ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

‘రామరాజు ఫర్ భీమ్’ పేరిట ఎన్టీఆర్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాకముందే ఓ కొత్త అప్డేట్ అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read: వామ్మో.. రమ్యకృష్ణ పారితోషికం అన్ని కోట్లా..?

కొన్నిరోజులుగా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉండగా తాజాగా అప్డేట్ వారిలో జోష్ నింపింది. చాలారోజుల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఓ వాణిజ్య ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొమురంభీం లుక్కులో ఎన్టీఆర్ సరికొత్తగా కన్పిస్తుండటంతోె నందమూరి ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి.