Anu Emmanuel: టాలీవుడ్ హాట్ బ్యూటీ ‘అను ఇమ్మాన్యుయేల్’ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా నటించిన ‘ఊర్వశివో రాక్షాసివో’ సినిమా సక్సెస్ కావడంతో అను తెగ పాపులర్ సాధిస్తోంది. ఇందులో భాగంగా ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో కొన్ని సినిమాలకు కమిట్ అవుతూనే కోలీవుడ్లోనూ ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా ఈ భామ తమిళ స్టార్ హీరో కార్తీ పక్కన నటించనుంది. ఈ సినిమాకు ‘జపాన్’ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో అను బ్యూటీ పాల్గొనడంతో ఇక ఈమె హీరోయిన్ అని తేలిపోయింది.

అనూ ఇమ్మాన్యుయేల్ 1997 మార్చి 28న అమెరికాలో జన్మించింది. ఆమె బాల్యమంతా డల్లాస్ లోనే గడిచింది. ఈమె పాఠశాలలో చదువుతుండగానే ‘స్వప్నవిహారి’ అనే సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత స్టడీస్ పై దృష్టి పెట్టిన ఈ సుందరి తెలుగులోనే నాని హీరోగా ‘మజ్ను’లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకున్నా అనుకు అవకాశాలు తలుపు తట్టాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో అవకాశం తెచ్చుకుంది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఆమె కెరీర్ కు పులిస్టాప్ పడినట్లేనని అనుకున్నారు.
కానీ మూడో సినిమాను ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఒానత వాసి’నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా హిట్టు, ఫట్టు తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తోంది. లేటెస్టుగా ఆమె అల్లు శిరీష్ తో ‘ఊర్వశివో.. రాక్షాసివో’ సినిమాలో హీరోయిన్ గా అలరించింది. ఈ సినిమాలో అందచందాలను ఆరబోస్తూ కాస్త కెమెస్ట్రీ పండించడంలో అనూ సక్సెస్ సాధించింది. దీంతో ఈ భామ కోసం కొందరు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఆమె నటనకు ఫిదా అయినా తమిళ డైరెక్టర్ కార్తీ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామ ‘జపాన్’ తో తమిళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. గతంలో ‘తుప్పారివాలన్’, ‘నమ్మవీట్టు పిల్లై’ అనే తమిళ సినిమాల్లో అను అవకాశాలు తెచ్చుకుంది. కానీ తాజాగా స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రావడంతో అను కెరీర్ ఇక మలుపు తిరిగినట్లేనని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
