Homeఎంటర్టైన్మెంట్Immadi Ravi Ibomma: రవి అరెస్ట్.. ఐ బొమ్మ కీలక ప్రకటన.. పోలీసులు ఇది ఊహించలేదుగా?

Immadi Ravi Ibomma: రవి అరెస్ట్.. ఐ బొమ్మ కీలక ప్రకటన.. పోలీసులు ఇది ఊహించలేదుగా?

Immadi Ravi Ibomma: ఇన్నాళ్లపాటు పోలీసులకు చుక్కలు చూపించిన ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు అయ్యారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఐ బొమ్మ ద్వారా ఆయన బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేవారు. ఇందుకు ప్రతిగా ఆయన కోట్లు వసూలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఖాతాలో మూడు కోట్ల వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఆ నగదు మొత్తాన్ని పోలీసులు నిలుపుదల చేశారు. అంతేకాదు రవి నిర్వహిస్తున్న ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్లను కూడా నిలిపివేసినట్టు ప్రకటించారు.

రవి అరెస్టు తర్వాత తెలంగాణ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.. “రవి హ్యాకింగ్ ద్వారా ఎన్నో సినిమాలను డౌన్లోడ్ చేశాడు. ఆ సినిమాలను తన హార్డ్ డిస్క్లో భద్రంగా ఉంచాడు. అంతేకాదు తన వెబ్సైట్ ద్వారా సినిమాలను చూస్తున్న వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. దానిని బెట్టింగ్ వెబ్సైట్లకు విక్రయించాడు. ఇలా మొత్తం కోట్లు సంపాదించాడు. ఈ నగదు మొత్తాన్ని అతడు వివిధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. ఇదంతా కూడా మా దర్యాప్తులో తేలింది. అందువల్లే కొంతకాలంగా అతడి మీద నిఘా పెట్టాం. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశామని” తెలంగాణ పోలీసులు వెల్లడించారు.

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు అయిన తర్వాత ఇండియాలో ఆ వెబ్సైట్ సేవలు నిలిచిపోయాయి. అంతేకాదు పోలీసులు దానికి సంబంధించిన అన్ని సాంకేతిక వ్యవస్థలను తమ ఆదుపులోకి తీసుకున్నారు. వాటి సేవలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి ఒక కీలక సందేశం వచ్చింది. “మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని” ఐ బొమ్మ నిర్వాహకులు ఒక సందేశాన్ని పంపించారు.. దీంతో చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.” అంత డబ్బు పెట్టి మేము సినిమాలు చూడలేం. ఓటీటీ లను సబ్స్క్రయిబ్ చేసుకోలేం. మాలాంటి వారికి ఇన్ని రోజులపాటు ఐ బొమ్మ అండగా నిలిచిందని” కొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. ” సినిమా అనేది వందల మంది కార్మికుల శ్రమ. దానిని హ్యాకర్లు చోరీ చేస్తున్నారు. వెబ్సైట్లో పెడుతున్నారు. అటువంటి వారికి ఇటువంటి శిక్ష పడాలని” మరి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే ఐ బొమ్మ నుంచి ఈ సందేశం రావడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెబ్సైట్ వెనక చాలామంది ఉన్నారని తెలుస్తోంది.. వారి గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version